ఈనెల20 న మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా
1 min read
జూలై 7 వరకు దశల వారి ఉద్యమాలు
ఏపి.మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి భజంత్రీ శ్రీనివాసరావు
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: అపరిష్కృతంగాఉన్న మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 20న నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద జరిగే ధర్నాను జయప్రదం చేయాలని ఏపి. మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి భజంత్రీ శ్రీనివాసరావు పిలుపునిచ్చారు.ఏపి.మున్సిపల్ వర్కర్స్ యూనియన్( ఏఐటీయూసీ)ఏలూరు నగర సమితి సమావేశం బంగారు అక్కమ్మ అధ్యక్షతన సిపిఐ జిల్లా కార్యాలయం స్ఫూర్తి భవనము నందు ఏఐటీయూసీ జిల్లా కార్యాలయంలో జరిగింది.ఈ సమావేశంలో పాల్గొన్న భజంత్రీ శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా పెరిగిన జనాభాకు అనుగుణంగా మున్సిపల్ కార్మికుల కొరత తీవ్రంగా ఉందని తెలిపారు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటానికి,పరిసరాల్లో పారిశుధ్యం మెరుగుపరచడానికి నిరంతరం పనిచేస్తున్న మున్సిపల్ కార్మికుల సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం పారిశుధ్య, ఇంజనీరింగ్ విభాగాలను థర్డ్ పార్టీ కాంట్రాక్టర్లకు అప్పజెప్పే కార్మిక వ్యతిరేక విధానాలను విడనాడాలని డిమాండ్ చేశారు.చాలీచాలని జీతాలతో జీవిస్తున్న మున్సిపల్ కార్మికులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమలు చేయాలని, చనిపోయిన పదవీ విరమణ చేసిన కార్మికుల పిల్లలకు ఉద్యోగాలు కల్పించాలని, పర్మినెంట్ కార్మికులకు చెల్లించవలసిన బకాయిలను మొత్తం తక్షణమే చెల్లించాలని, .కోర్టు తీర్పు మేరకు కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని, మున్సిపల్ కార్మికులకు ఇల్లు,ఇళ్ల స్థలాలు ప్రభుత్వం కేటాయించాలని డిమాండ్ చేశారు. ఏలూరు నగర కార్పొరేషన్ లో శానిటరీ ఇన్స్పెక్టర్లు, మేస్త్రీలకు బదిలీలు చేపట్టాలని కోరారు.మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం భీమవరంలో జరిగిన రాష్ట్ర సమితి సమావేశం చర్చించి దశల వారీ కార్యాచరణకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ నెల 20వ తేదీ నుండి జూలై 7 వరకు జరిగే ఆందోళన కార్యక్రమాల్లో మున్సిపల్ కార్మికులందరూ పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో యూనియన్ గౌరవాధ్యక్షులు ఉప్పులూరి హేమ శంకర్,యూనియన్ నగర కార్యదర్శి దడ్డికర్ల నాగబాబు, యాలగాడ శివకుమార్, అంతరాజు కిరణ్, పైడారి వంశి,బంగారు గురు ప్రసాద్, మరియదాసు .రాఘవులు దేవి, అల్లం పెద్దిరాజు, గోవాడ మల్లేశ్వరరావు, బంగారు లోకేష్, అన్నామని తదితరులు పాల్గొన్నారు.

