NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

దివ్యాంగులకు నోట్ పుస్తకాల పంపిణీ

1 min read

పంపిణీ చేసిన డీఎస్ఎస్ సిస్టర్ శిల్పా..

నందికొట్కూరు న్యూస్ నేడు: దివ్యాంగ చిన్నారులు మంచిగా చదువుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని విమల ప్రొవైన్స్ సుపీరియర్ సిస్టర్ శిల్పా అన్నారు. కర్నూలు మండలం వెంకాయపల్లె విమల ప్రొవిన్సియల్ హౌస్ లో దీన సేవన సభ వ్యవస్థాపకులు సిస్టర్ మదర్ పేత్రా 50 వ వర్ధంతి మరియు విమల ప్రొవైన్స్ ఫీస్ట్ డే సందర్బంగా శనివారం కార్యక్రమం నిర్వహించారు.ముందుగా సిస్టర్లు జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభిచారు. చదువుతున్న 55 మంది దివ్యాంగులకు నోట్ బుక్స్ మరియు స్కూల్ బ్యాగ్ లను సిస్టర్ శిల్పా,సిస్టర్ అల్ఫోన్స, విమల ప్రొవైన్స్ వైస్ సుపీరియర్ సిస్టర్ దీప్తి, సోషల్ కౌన్సిలర్ సిస్టర్ సారంగ విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సిస్టర్ శిల్పా మాట్లాడుతూ 2000 సంవత్సరం నుండి ఈ ప్రాంతంలో ఉన్న దివ్యాంగులకు విద్య,ఆరోగ్యం,సామాజిక తదితర వాటిపై అవగాహన కల్పిస్తూ వారి జీవన అభివృద్ధికి ఎంతగానో కృషి చేశామని వివిధ సేవా కార్యక్రమాల ద్వారా పేద ప్రజలను ఉత్తేజపరుస్తున్నామని ఇదంతా కూడా మదర్ పేత్రా స్పూర్తితోనే ముందుకు వెళ్తున్నామని అన్నారు. రాబోయే రోజుల్లో మీరు కూడా ఆపదలో ఉన్న వారికి పేద ప్రజలకు మీ వంతుగా సహాయ సహకారాలు అందించాలని దివ్యాంగులు అనే చిన్న చూపు లేకుండా వారిని మంచిగా చదివించాలని సిస్టర్ శిల్పా తల్లిదండ్రులకు సూచించారు. ఈ కార్యక్రమంలో సిస్టర్ నీతూ,సిస్టర్ క్లేరీనా,సిస్టర్ బెట్టి,దివ్యాంగులు మరియు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.

About Author