ఏలూరులో జరిగిన సంఘటనపై డీఎస్పీకి ప్రెస్ ఫోరమ్ వినతి
1 min read
పీఆర్వో సంజయ్కు సంబంధించిన ఘటన
ఏపి డబ్యూ జె ఏఫ్ ఆధ్వర్యంలో ఫిర్యాదు
ఏలూరు, న్యూస్ నేడు : ది ఏలూరు ప్రెస్ ఫోరమ్ పీఆర్వో సంజయ్కు శుక్రవారం జరిగిన ఒక సంఘటనపై ప్రెస్ ఫోరమ్ సభ్యులు ఏలూరు డీఎస్పీ శ్రవణ్ కుమార్ను కలిసి వినతిపత్రం అందజేశారు.ప్రెస్ ఫోరమ్ జిల్లా అధ్యక్షులు డి.వి. రమణ ఆధ్వర్యంలో సభ్యులంతా డీఎస్పీ కార్యాలయానికి వెళ్లి జరిగిన సంఘటన వివరాలను తెలియజేశారు. ఈ ఘటనపై తక్షణమే విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వినతిపత్రంలో కోరారు.డీఎస్పీ శ్రవణ్ కుమార్ సానుకూలంగా స్పందించి, వినతిపత్రాన్ని పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు ప్రెస్ ఫోరమ్ నేతలు తెలిపారు.


