NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్రకృతి వ్యవసాయంలో పండిన ఆహారం ప్రతి ఇంటికి చేరేలా చేయాలి

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  స్థానిక బి. తాండ్రపాడు టీటీడీసీ సమావేశ హాల్ లో  సెర్ప్ అధ్వర్యంలో ఫుడ్ బాస్కెట్  అమలు మరియు కార్యాచరణ పై, న్యూట్రి ఎంటర్‌ప్రైజ్‌ స్థాపన పై  ఆస్పరి, దేవనకొండ మండల సిసి లకు, సిబ్బందికి, వివొఎ ల కు, ఓబిల కు, ఫుడ్ బాస్కెట్ సబ్ కమిటీ వారి శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న పథక సంచాలకులు డి.ఆర్.డి.ఎ   శ్రీ రమణా రెడ్డిఈ కార్యక్రమంలో ప్రధానంగా ఫుడ్ బాస్కెట్ కార్యక్రమం యొక్క లక్ష్యం ఏమనగా గ్రామంలో  ఉన్న కుటుంబాలకు సురక్షితమైన, సమతుల్యమైన ఆహారం అందిస్తూ, ప్రకృతి వ్యవసాయంలో పండిన ఆహారం ప్రతి ఇంటికి చేరేలా చేయడం, బలహీన కుటుంబాల ఆరోగ్యం, పోషణ స్థితి మెరుగుపరచడం,  ఫుడ్ బాస్కెట్ ద్వారా ప్రతి కుటుంబానికి నిరంతరం పోషకాలతో  కూడిన మరియు  సురక్షితమైన ఆహారం అందుబాటులోకి తీసుకోని రావడం మరియు బలహీనమైన మరియు లబ్దిదారుల కుటుంబాలకు ఉపయోగపడుతుంది. గ్రామంలోనే ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తి పెరగడానికి దోహదం చేస్తుంది. ఫుడ్ బాస్కెట్  అనేది  గ్రామంలోనే నిర్వహించే ఒక కార్యక్రమం. ఇది ప్రతి కుటుంబానికి, ముఖ్యంగా బలహీన వర్గాలకు మరియు లబ్దిదారులకు సురక్షితమైన, చవకైన, పోషకాహారాన్ని  క్రమం తప్పకుండా అందేలా చేస్తుంది. సంస్థలు కలిసి అమలు చేయడం జరుగుతుంది.హోమ్ స్టెడ్ ఫుడ్ ప్రొడక్షన్ మీద మూడు నెలల యాక్షన్ ప్లాన్ తయారు చెయ్యడం జరిగినది. అందులో న్యూట్రి గార్డెన్, కమ్యూనిటీ న్యూట్రి గార్డెన్  అలాగే పెరటి కోళ్ల పెంపకం గురించి అవగాహన కల్పించి అమలు చేయవలెనని సెర్ప్ మరియు.ఈ కార్యక్రమంలో డిపిఎం  శ్రీమతి మాధురి , డిపిఎం (హెచ్ డీ) శ్రీమతి నరసమ్మ , ఏపియం (హెచ్.డి) శ్రీ అయ్యన్న,   డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ శ్రీమతి అరుణ ,  సిసి లు,  సిబ్బంది, వివొఎ లు, ఓబిలు, మండల సమాఖ్య  కమిటీ, ఫుడ్ బాస్కెట్ సబ్ కమిటీ తదితరులు పాల్గొన్నారు.

About Author