NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కార్మికులకు నూతన వస్త్రాలు పంపిణీ..

1 min read

కార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యత.

250మందికి దుస్తువుల అందజేత.

ఉద్యోగుల మేలు చేయడమే లక్ష్యం

సాయి శానిటేషన్ సోషల్‌ సర్వీసు ఆర్గనైజేషన్ అధ్యక్షులు పంచానంద్.

విజయవాడ, న్యూస్​ నేడు : కార్మికుల ఆరోగ్య భద్రత,సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని,వారికి నిరంతరం అండగా ఉంటామని సాయి శానిటేషన్ సోషల్‌ సర్వీస్ ఆర్గనైజేషన్ అద్యక్షులు పంచానంద్ అన్నారు.స్ధానిక బస్టాండ్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో‌ సాయి శా‌నిటేషన్‌ సోషల్‌ సర్వీస్‌ ఆర్గనైజేషన్ లో పని‌ చేస్తున్న కార్మికులకు,ఉద్యోగులకు,పెదలైన వారికి కలిపి సుమారు 250మందికి పైగా నూతనంగా వస్తాలను సంస్ధ ప్రతినిధులు అందజేశారు.ఈ‌ సందర్భంగా సంస్ధ ప్రతినిధులు మాట్లాడుతూ దీపావళి సందర్భంగా అందరికి మేలు జరగాలని,ప్రతి‌కుటుంబంలో కాంతులు ప్రతి వెల్లు విరావాలని అకాంక్షించారు.అధ్యక్షులు పంచానంద్ మాట్లాడుతూ విజయవాడలో పని చేస్తున్న వారికే కాకుండా నెల్లూరు, తిరుపతి,విశాఖపట్నం,హైదరాబాదు తదిత ప్రాంతాల్లో పని‌ చేస్తున్న తమ సంస్ధ ఉద్యోగులకు నూతన దుస్తులు అందజేస్తున్నామని,కార్మికులకు మేలు చేయడంతో వారి సంక్షేమాని అన్ని విధాల కృషి చేస్తున్నామని వివరించారు.ఈ కార్యక్రమంలో సెక్రటరీ మున్నిదేవి,కమీటీ సభ్యులు రేఖ దేవి,నిర్వహకులు టి.వెంకటశ్రీను,దీపక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

About Author