రాష్ట్ర ప్రభుత్వం నెల చివరినాటికి 3 లక్షల ఇండ్లకు గృహప్రవేశాలకు సన్నాహాలు
1 min read

మన జిల్లాలో 12,345 ఇండ్లను సిద్ధం చెయ్యాలి
జిల్లాలో గృహ నిర్మాణాలు లక్ష్యసాధనలో అధికారులు కలిసికట్టుగా పనిచేసి మంచి ప్రగతిని సాధించాలి
లక్ష్య సాధనలో వెనుక బడిన ఆయా అధికారులు, సహాయకులుపై చర్యలు తప్పవు
ఈ నెల18వ తేదీ హౌసింగ్ “డే” (ప్రేరణ) రోజున లబ్ధిదారులతో అవగాహన సదస్సులు నిర్వహించాలి
నేను రెండు సదస్సులకు హాజరవుతాను
జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : జిల్లా కలెక్టరేటు గోదావరి సమావేశ మందిరంలో గురువారం జిల్లాలో “గృహ నిర్మాణాలు ప్రగతిపై” సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి అధ్యక్షతన సమావేశాన్ని నిర్వహించారు. జిల్లాలో ఇండ్ల నిర్మాణాలు 12,345 టార్గెట్ కాగా 10,565 పూర్తి చేసి ఇంకా 1,780 ఇండ్లు పూర్తి చెయ్యకపోవడంపై జిల్లా కలెక్టరు అసహనం వ్యక్తం చేశారు. మండలాలు వారీగా సంబంధిత అధికారులతో సమీక్షించారు. బాగా వెనుకబడిన మండలాలు డిఇ, ఏఇ, ఇంజనీరింగు అసిస్టెంటు, మండల ఇన్చార్జిలతో టార్గెట్ వెనుకబడుట కారణాలను చెప్పమని జిల్లా కలెక్టరు నిలదీశారు. వారం రోజుల్లో 403 ఇండ్లను పూర్తి చేసి, మిగిలిన ఇండ్లను ఈ నెల చివరినాటికి పూర్తి చెయ్యాలని ఆదేశించారు. సమావేశానికి హాజరుకాని 5 మంది ఇంజనీరింగు అసిస్టెంట్లకు షోకాజ్ నోటీసులు జారీ చెయ్యాలని జిల్లా గృహ నిర్మాణశాఖ పిడి జి. సత్యనారాయణను జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి ఆదేశించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల చివరినాటికి 3 లక్షల ఇండ్లను సమూహిక గృహప్రవేశాలకు సన్నాహాలు చేస్తుందని, మన జిల్లా 12,345 ఇండ్లను గృహప్రవేశాలకు సిద్ధం చెయ్యాలని అధికారులకు ఆదేశించామని అన్నారు. క్షేత్రస్థాయిలో అధికారులు సమన్వయంతో పనిచేసి, ఈ నెల చివరినాటికి నూటికినూరుశాతం ఇండ్లను పూర్తి చేసి పూర్తిస్తాయి నివేదికను సమర్పించాలని అన్నారు.ఈ సమావేశంలో జిల్లా గృహనిర్మాణ పిడి జి.సత్యనారాయణ, ఇఇలు, డిఇ లు, సహాయ ఇంజనీర్లు, ఇంజనీరింగు అసిస్టెంట్లు, మండల ఇంచార్జిలు, జిల్లా గృహ నిర్మాణశాఖ ఉద్యోగులు, తదితరులు పాల్గొన్నారు.


