NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

హొళగుంద జెడ్పీహెచ్ స్కూల్ పది ఫలితాల్లో అగ్రస్థానం

1 min read

ఈబీజీ గోవింద్ గౌడ్ ఆధ్వర్యంలో టాపర్‌లకు ఘన సన్మానం – తల్లిదండ్రులకు గౌరవం

హోళగుంద న్యూస్ నేడు:  హొళగుంద మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (ZPHS) విద్యార్థులు 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో అద్భుత ప్రతిభ కనబరిచి మండలానికి గర్వకారణంగా నిలిచారు. ఈ సందర్భంగా రైస్ మిల్ ప్రాంగణంలో టాపర్ విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులకు ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి టిడిపి మండల ప్రధాన కార్యదర్శి ఈబీజీ గోవింద్ గౌడ్  ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను అభినందించారు. ఫలితాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులు: షాలి సఖ్లైన్ – 582 మార్కులు (1వ స్థానం) గంగాధర్ – 576 మార్కులు (2వ స్థానం)తరుణ – 570 మార్కులు (3వ స్థానం)ఈ సందర్భంగా గోవింద్ గౌడ్ మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు , విద్యాశాఖ మంత్రి నారా లోకేష్  మరియు ఆలూరు టీడీపీ ఇంచార్జ్ వైకుంఠం జ్యోతి  నాయకత్వంలో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు కూడా సమాన అవకాశాలు కల్పించేందుకు అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు.విద్యార్థులు మరింత కృషి చేసి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. ప్రతి విద్యార్థి పట్టుదలతో చదివి భవిష్యత్తులో మంచి స్థానం సంపాదించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో టాపర్‌లకు శాలువాలు కప్పి, పూలహారాలు వేసి, స్వీట్లు పంచి ఘనంగా సన్మానించారు. అలాగే వారి తల్లిదండ్రులను కూడా ప్రత్యేకంగా గౌరవించారు. కార్యక్రమం ఆనందోత్సాహాల మధ్య విజయవంతంగా జరిగింది.పాల్గొన్నారు:ఈ కార్యక్రమంలోఈబీజీ గోవింద్ గౌడ్, పంపాతి, యారిస్వామి, వీరన్న గౌడ్, ముల్లా మొయిన్, రామంజి, ల్యాబ్ గిరి, మలయ్య, వలి బాషా, సింధు, వలం మల్లి,, రారవి సిద్ధు, వీరేశ్, షాలి అమామ్ తదితరులు పాల్గొన్నారు.

About Author