NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రాష్ట్ర ముఖ్యమంత్రి రాక సందర్భంగా ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్, ఎస్పీ

1 min read

జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి

కర్నూలు,న్యూస్​ నేడు: రాష్ట్ర ముఖ్యమంత్రి రాక సందర్భంగా ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి అధికారులను ఆదేశించారు.ఈ నెల 6 వ తేదీన  ఎమ్మిగనూరు మండలం కలుగొట్ల గ్రామంలో ముఖ్యమంత్రి  పర్యటన సందర్భంగా హెలిప్యాడ్, గ్రామసభ, రైతు పొలం ప్రదేశాలను జిల్లా  కలెక్టర్, ఎస్పీ, జాయింట్ కలెక్టర్ ఏర్పాట్లను పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లా  కలెక్టర్  హెలిప్యాడ్, గ్రామసభ, రైతు పొలం  తదితర ప్రాంతాల్లో  జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలిస్తూ వేగవంతంగా పనులు పూర్తి కావాలని అధికారులను ఆదేశించారు. గ్రామసభ నిర్వహించాల్సిన  తీరును అధికారులకు వివరిస్తూ, ఎక్కడా ఎలాంటి పొరపాట్లు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.  వేదిక, స్టాల్స్ , గ్రీన్ రూమ్ ఏర్పాట్లపై అధికారులకు తగిన సూచనలు ఇచ్చారు. భద్రతా ఏర్పాట్ల లో ఎలాంటి లోపం ఉండకూడదన్నారు. సభకు హాజరైన రైతులకు తాగునీరు, భోజనం, స్నాక్స్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.  రోడ్ల మరమ్మతుల పనులు సాయంత్రానికి  పూర్తిచేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.కార్యక్రమంలో ఎస్పీ విక్రాంత్ పాటిల్, జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

About Author