NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మత కలహాలు పెట్టినవారిని  కఠినంగా శిక్షించాలి

1 min read

కోట ప్రభాకర్ మాదిగ..

నందికొట్కూరు, న్యూస్​ నేడు:  నందికొట్కూరు మారుతి నగర్ చర్చి దగ్గర జరిగిన వివాదంలో అయ్యప్ప స్వాములకు మాకు ఎటువంటి ఘర్షణ జరగలేదు చర్చి దగ్గర ఉన్నటువంటి కొందరు మహిళలు సౌండ్ తగ్గించుకోండి అని చెప్పారు దానికి సరే అని చెప్పాం అంతటితో వారు వచ్చి మాల మాదిగలను మా పక్కన పెట్టుకోవడమే మా తప్పు వీళ్లను ఇంకా ఎన్ని రోజులు భరించాలో అని తిట్టారు.ఈ విషయమే అక్కడ ఉన్న ఆడవాళ్లు ఒకరినొకరు తిట్టుకుంటూ ఉండగా జాలంగారి నాగన్న అనే వ్యక్తి అక్కడికి వచ్చాడు వచ్చి మాల మాదిగలు ఏం చేశారు అమ్మ ఎందుకు అలా తిడుతున్నారని ఎందుకు మాట్లాడుతున్నారు అని మాట్లాడుతూ ఉండగా అక్కడున్న మహిళలు అతనిపై చేయి చేసుకున్నారు.విషయం తెలుసుకున్న నాగన్న కోడలు మా మామను కొడతారా అని ఆడవాళ్లు వచ్చి ఒకరికొకరు కొట్టుకు న్నారు.మేము కొట్లాడుతుంటే అయ్యప్ప స్వాములు పక్కనే ఉన్నారు కానీ మేము వాళ్ళని ఏమి అనలేదు వాళ్ళు మమ్మల్ని ఏమీ అనలేదు. మాతో కొట్లాడిన వాళ్ళు మేము మాదిగలతో పెట్టుకున్నా వీళ్లు కేసులు పెడతారని ఉద్దేశంతో ఈ కొట్లాటను సాములు పైకి వేసి  వారికి చెప్పుతో కొట్టారు వారి దండలు తెంచారు అని తప్పుడు ప్రచారం చేశారు. మేము కొట్లాడేటప్పుడు చాలామంది వీడియోలు కూడా తీశారు అందులో మేము ఏ ఒక్క సామితో కూడా కొట్లాడలేదు.మేమంటే పడని కొందరు వ్యక్తులు తప్పుడు ప్రచారం చేసి సాములపై ఆడవారు చెప్పుతో కొట్టారని దండలు తెంచారు అని సోషల్ మీడియాలో వైరల్ చేశారు. పూర్తి వివరాలు తెలుసుకొని పోలీసులు మమ్ములను స్టేషన్ కి తీసుకువెళ్లి ఇబ్బంది పాలు చేశారు.మాకు న్యాయం చేయండి అని మారుతి నగర్ కు చెందిన రాధమ్మ,జయమ్మ,హుసేనమ్మ శ్రీదేవి, సులోచనమ్మ,చిట్టెమ్మ,మణికమ్మ,అయ్యమ్మ నందికొట్కూరు ఎమ్మార్పీఎస్ ఆఫీసు నందు ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో తెలియజేయడం జరిగింది.ఈ విషయం తెలుసుకున్న నంద్యాల జిల్లా ఎంఎస్పీ అధికార ప్రతినిధి మరియు నందికొట్కూర్  ఇంచార్జ్ కోటా ప్రభాకర్ మాదిగ  మాట్లాడుతూ దళితులపై దాడి చేసి పైగా ఈ దాడిని హిందువులకు క్రైస్తవులకు దాడిగా వక్రీకరించిన వారిని సోషల్ మీడియాలో తప్పుడు విషయాలు చెబుతూ హిందువులపై దాడి జరిగింది అని అయ్యప్ప స్వాములను  రెచ్చ కొట్టడంతో వారు నందికొట్కూరులో ధర్నాలు ర్యాలీలు చేస్తూ క్రైస్తవ చర్చిలను రద్దు చేయాలంటూ నినాదాలు ఇస్తున్నారు.ఇది మత ఘర్షణకు దారితీస్తుంది.కావునా అయ్యప్ప స్వాములను కొట్టారు అని తప్పుడు ప్రచారం చేసిన వాళ్లను వెంటనే అరెస్టు చేసి  చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *