NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఈవిఎం గోడౌన్ ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి

1 min read

ఏలూరు, న్యూస్ నేడు :   స్ధానిక జిల్లా కలెక్టరేటు ప్రాంగణంలో ఉన్న ఎలక్ట్రానిక్ ఓటింగు మిషన్ల గోడౌన్ ను  మంగళవారం జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి తనిఖీ చేశారు. ఈవిఎం గోడౌన్ వద్ద సిసి కెమేరాలతో ఏర్పాటు చేసిన భధ్రతా ఏర్పాట్లను    ఈవిఎం యంత్రాలు బి.యులు, సియులు, వివిప్యాట్ లను, అక్కడి భధ్రతా ఏర్పాట్లను  పరిశించారు. అనంతరం పరిశీలన రిజిస్టరులో జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి సంతకం చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు మేరకు ఈవీఎం గోడౌన్ తనిఖీలో భాగంగా ఈవిఎం గోడౌన్ కు వేసిన భధ్రతా సీళ్లు, సిసి కెమెరాలు పనితీరు, అగ్నిమాపక దళ పరికరాలు, మొదలైనవి పరిశీలించారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టరు  కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ భారతీయ ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈవిఎం గోడౌన్ కు పటిష్ట భధ్రత కల్పించామన్నారు. ఎప్పటి కప్పుడు గౌడౌన్ క్షుణంగా తనిఖీ చేసి ఎన్నికల సంఘానికి నివేదిక పంపిస్తున్నామన్నారు. ఈవిఎం గోడౌన్ వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీస్ గార్డులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.   జిల్లా కలెక్టరు వెంట డిఆర్ఓ వి. విశ్వేశ్వరరావు,   కలెక్టరేట్ సూపరింటెండెంటు కె.చల్లన్నదొర,   తదితరులు  ఉన్నారు. 

About Author