NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

వన్ కంట్రీ.. వన్  ట్యాక్స్…

1 min read

రాష్ట్రాలతో మాట్లాడి రాయితీలతో జీఎస్టీ సంస్కరణలు తెచ్చారు..

ప్రజలపై భారం తగ్గించారు

ప్రధాని నరేంద్ర మోదీ రాజకీయ నైపుణ్యంతోనే సాధ్యమైంది..

16న కర్నూలు జరిగే ప్రధాని సభను జయప్రదం చేద్దాం

రాజ్యసభ మాజీ సభ్యుడు టి.జి. వెంకటేష్

కర్నూలు, న్యూస్ నేడు: దేశ ప్రధాని నరేంద్ర మోదీ రాజకీయ నైపుణ్యంతో రాయితీ జీఎస్టీ సంస్కరణలు తీసుకొచ్చారని రాజ్య సభ మాజీ సభ్యుడు టిజి వెంకటేష్ అన్నారు. మంగళవారం మౌర్య ఇన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.  ఒక దేశం.. ఒక ట్యాక్స్ అనే పద్ధతిలో రాష్ట్రాలతో మాట్లాడి.. వారికి ఇవ్వాల్సిన రాయతీలు ఇచ్చి జీఎస్టీ సంస్కరణలు తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి అని ప్రశంసించారు. దేశాభివృద్ధి కోసం ఆయన తీసుకున్న నిర్ణయాలు సాహసోపేతమన్నారు.  రష్యా నుంచి తక్కువ ధరకు చమురు తీసుకొచ్చారని, దేశీయ వస్తువుల కొనుగోలుతో దేశాభివృద్ధి పరుగులు పెడుతోందన్నారు. సీఎం చంద్ర బాబు నాయుడుతో కలిసి రాష్ట్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి టిజి భరత్ కేంద్రానికి వెళ్లి పరిశ్రమలు, పెట్టుబడులు తీసుకురావడంలో సఫలమయ్యారన్నారు. రాయలసీమ అభివృద్ధికి బీజేపీ అండగా ఉంటుందని, రాష్ట్రానికి రావాల్సిన ఆర్థిక వనరులు, ఇతర అభివృద్ధి, సంక్షేమ ఫలాలను ప్రధాని నరేంద్రమోదీని అడిగి తీసుకోవాలని ఈసందర్భంగా రాజ్య సభ మాజీ సభ్యులు టిజి వెంకటేష్ పేర్కొన్నారు.

మోదీ సభను జయప్రదం చేద్దాం..

ఈ నెల 16న కర్నూలులో పర్యటించనున్న దేశ ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనను ప్రజల సహకారంతో దిగ్విజయం చేయాలని మాజీ ఎంపీ టిజి వెంకటేష్ పిలుపునిచ్చారు.   బీజేపీ రాయలసీమ డిక్లరేషన్ ఇచ్చింది… అందులో ఒక్కొక్కటిగా సాధిస్తున్నాం..హై కోర్టు బెంచ్ వస్తుంది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని, కేంద్రం నుంచి మరిన్ని  ఆర్థిక వనరులు తెచ్చుకునేందుకు ప్రయత్నించాలని ఈ సందర్భంగా మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ అన్నారు.

About Author