NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రైతులకు యూరియా సకాలంలో అందించండి..

1 min read

రైతులను దోచుకుతింటున్న యూరియా

యూరియా బ్లాక్ మార్కెట్ వ్యాపారులపై చర్యలు తీసుకోవాలి

మిడుతూరు, న్యూస్​ నేడు:  (నందికొట్కూరు): రైతులకు యూరియా సకాలంలో అందించాలని అదేవిధంగా రైతులను దోచుకుతింటున్న యూరియా బ్లాక్ మార్కెట్ వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ జిల్లా కార్యదర్శి పి క్కిలి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు.నంద్యాల జిల్లా మిడుతూరు మండల కేంద్రంలో రైతులతో కలిసి మంగళవారం రాస్తారోకో చేపట్టారు.ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ యూరియాను అధిక ధరలకు అమ్ముతున్నా వ్యవసాయ అధికారులు పట్టించుకోవడం లేదని ఖరీఫ్ సీజన్‌లో మండల రైతులు మొక్కజొన్న,పత్తి, కంది,మిరప,ఉల్లి,పొగాకు వంటి పంటలను విస్తారంగా సాగు చేస్తున్నారని కానీ గత 20 రోజులుగా రైతు సేవా కేంద్రాలు,సహకార సొసైటీలో ఒక్క బస్తా యూరియా కూడా అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.గత నెల 28న డిపాజిట్ చేసినప్పటికీ ఇప్పటివరకు యూరియా రాలేదని మండలానికి కనీసం 2వేల బస్తాలు అవసరం ఉందని తెలిపారు.ప్రైవేట్ షాపుల్లో మాత్రం యూరియా బస్తాను ప్రభుత్వ ధర 260 బదులుగా 300–350 రూ.కు బ్లాక్‌లో అమ్ముతున్నారని, పైగా బిల్లులో ఒక రేటు, వసూలులో మరో రేటు చూపుతూ రైతులను మోసం చేస్తున్నారని విమర్శించారు.ఈ అక్రమాలను పట్టించుకోకుండా వ్యవసాయ అధికారులు చూసీ చూడనట్టుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.అందువలన, బ్లాక్ మార్కెట్ వ్యాపారులపై లు చర్య తీసుకోవాలని జిల్లా అధికారులు తక్షణమే జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు.లేకపోతే రైతులతో కలిసి ఆందోళన చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు శేఖర్,దేవనూరు నాగరాజు,సోమసేన నాయుడు,సోమప్ప,మాదారం స్వాములు,మహిళా నాయకురాలు,భీబీ,మూర్తు జాబి పాల్గొన్నారు.

About Author