NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మహిళా శిషు సంక్షేమ శాఖ అధికారులతో జిల్లా కలెక్టర్ సమావేశం

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు: మహిళలు, బాలల సంక్షేమానికి సంబంధించిన అన్ని పథకాలు సమర్థవంతంగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి ఐసిడిఎస్ అధికారులను ఆదేశించారు.మంగళవారం కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో మిషన్ వాత్సల్య, మిషన్ శక్తి సంక్షేమ పథకాల అమలుపై కలెక్టర్ జిల్లా బాలల సంక్షేమ సమితి, జిల్లా బాలల పరిరక్షణ విభాగం, మహిళా శిషు సంక్షేమ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర మహిళా మరియు శిశు అభివృద్ధి శాఖ (MWCD) జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం జిల్లా బాలల పరిరక్షణ విభాగం (DCPU) స్వతంత్రంగా పనిచేయాల్సి ఉందని, ఆ మేరకు  వెంటనే ప్రత్యేక కార్యాలయం ఏర్పాటు చేసుకొని చైల్డ్ వెల్ఫేర్ కమిటీతో కో ఆర్డినేట్ చేసుకొని పని చేయాలని కలెక్టర్ డిసిపిఓ ను ఆదేశించారు.  PM CARES పధకం కింద  కేవలం 16 మంది మాత్రమే లబ్ధిదారులుగా గుర్తించారని,   విధులలో ఎటువంటి నిర్లక్ష్య ధోరణి సహించబోమని కలెక్టర్ స్పష్టం చేశారు..జిల్లాలో బాలల సంక్షేమానికి సంబంధించిన కార్యక్రమాలు మరింత సమర్థవంతంగా అమలయ్యేలా అన్ని విభాగాల అధికారులు పరస్పర సమన్వయంతో, బాధ్యతాయుతంగా పనిచేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.. జిల్లాలో అమలవుతున్న బాలల సంక్షేమ కార్యక్రమాలపై సంబంధిత అధికారులకు పూర్తి అవగాహన ఉండాలని, ఫీల్డ్ స్థాయిలో నిర్వహిస్తున్న కార్యక్రమాలు కేవలం నామమాత్రంగా కాకుండా ఫలితాల ఆధారంగా అమలుకావాలని ఆదేశించారు.. సమావేశంలో ఐసిడిఎస్ పిడి విజయ, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్ పర్సన్ జుబేదాబేగం, చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ శారద, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ మెంబర్ లు సంజీవ రెడ్డి, వెంకట రమణయ్య, మధు సుధాకర్, డిస్ట్రిక్ట్ ప్రొబేషన్ అధికారి దివాకర్, అబ్జర్వేషన్ హోమ్ సూపరింటెండెంట్ హుస్సేన్ బాషా, తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *