NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఆలూరు ఎమ్మెల్యే విరుపాక్షి అరెస్టు సరికాదు  

1 min read

వాల్మీకి/బోయల రాజకీయ ఎదుగుదలను అడ్డుకునే కుట్ర: ఏపీవీబీఎస్ జిల్లా అధ్యక్షుడు ఎల్లార్తి అర్జున్

విరుపాక్షి అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాం – వెంటనే విడుదల చేయాలి

హోళగుంద న్యూస్ నేడు: ఆలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే బూసినే విరుపాక్షిని అరెస్టు చేయడం పూర్తిగా ప్రజాస్వామ్య విరుద్ధ చర్య అని, ఈ అరెస్టును ఏపీ వాల్మీకి/బోయల సంఘం (ఏపీవీబీఎస్) కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎల్లార్తి అర్జున్ తీవ్రంగా ఖండించారు. రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగానే ఈ అరెస్టు జరిగిందని ఆయన ఆరోపించారు.ఆలూరు నియోజకవర్గంలో వాల్మీకి/బోయల సామాజిక వర్గానికి చెందిన నాయకత్వం ప్రజల్లో ఆదరణ పొందుతూ రాజకీయంగా ఎదుగుతున్న నేపథ్యంలో ఆ ఎదుగుదలను తట్టుకోలేక కొందరు ఉద్దేశపూర్వకంగా కుట్రలు పన్ని తప్పుడు కేసులు బనాయించి ఎమ్మెల్యే విరుపాక్షిని ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడుతూ ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న నాయకుడిపై ఇలాంటి చర్యలకు పాల్పడటం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు. ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధిని రాజకీయ కారణాలతో లక్ష్యంగా చేసుకోవడం ద్వారా ప్రజల తీర్పును అవమానించినట్టేనని ఆయన విమర్శించారు.వాల్మీకి/బోయల సమాజానికి చెందిన నాయకులు రాజకీయంగా ఎదగకూడదనే ఉద్దేశంతో కక్షపూరిత చర్యలు కొనసాగుతున్నాయనే అనుమానాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయని అన్నారు. ఇటువంటి చర్యలు సామాజిక వర్గాల మనోభావాలను దెబ్బతీస్తాయని, ప్రజల్లో అసంతృప్తిని పెంచుతాయని పేర్కొన్నారు.ప్రభుత్వం రాజకీయ కక్షలను పక్కనపెట్టి చట్టబద్ధంగా వ్యవహరించాలని, ఎమ్మెల్యే విరుపాక్షిపై నమోదైన కేసులను నిష్పక్షపాతంగా విచారించాలని డిమాండ్ చేశారు. అక్రమంగా అరెస్టు చేసి వేధింపులకు గురిచేయడం మానుకుని వెంటనే విడుదల చేయాలని ఆయన కోరారు.ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి ఒక్కరికీ చట్టపరమైన హక్కులు ఉన్నాయని, అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రతిపక్ష నాయకులను అణచివేయాలనే ప్రయత్నాలు ఎప్పటికీ విజయవంతం కావని ఎల్లార్తి అర్జున్ స్పష్టం చేశారు.ఈ సందర్భంగా ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు అన్ని ప్రజాసంఘాలు, సామాజిక సంస్థలు, ప్రజలు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే విరుపాక్షి అక్రమ అరెస్టును వెంటనే ఉపసంహరించుకుని ఆయనను విడుదల చేయాలని, లేనిపక్షంలో ప్రజాస్వామ్యబద్ధమైన ఉద్యమాలను చేపట్టేందుకు వెనుకాడబోమని హెచ్చరించారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *