NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఏలూరు జిల్లా విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆత్మీయ సమావేసం

1 min read

12వ పిఆర్ సి కమీటి వేసి 30% మధ్యంత్ర భృతి ప్రకటిoచాలి

 అధ్యక్ష ,కార్యదర్శులు మరియు సంఘం డిమాండ్

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: కేంద్ర ఎన్డీఏ ప్రభుత్వం ప్రకటించిన 2025 పెన్షన్ వాలిడేషన్ చట్టం కు వ్యతిరేకంగా మార్చి 25న రాష్ట్ర విశ్రాంత ఉద్యోగుల సంఘం ఇచ్చిన ఉద్యోగుల పిలుపులో భాగంగా ఏలూరు జిల్లాలో కార్యక్రమం చేపట్టనున్నట్లు ఏలూరు జిల్లా విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆత్మీయ సమావేశం నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల అసోసియేషన్ ఏలూరు జిల్లా ఆత్మీయ సమావేశం స్థానిక కోట దెబ్బ లో ఉన్న విశ్రాంత ఉద్యోగుల సంఘ కార్యాలయంలో నేడు జరిగింది. సమావేశానికి సంఘం జిల్లా అధ్యక్షులు బి. ఆంజనేయులు అధ్యక్షత వహించారు. సమావేశంలో విశ్రాంత ఉద్యోగుల అసోసియేషన్ ఏలూరు జిల్లా ప్రధాన కార్యదర్శి కె.మహాలక్ష్ముడు, జిల్లా కోశాధికారి డి.గంగాధర రావు మాట్లాడుతూ ఇ హెచ్ ఎస్ కార్డుపై నగదు రహిత వైద్య సేవలు అందించడం, మెడికల్ రీయంబర్స్మెంట్ రెండు లక్షల నుండి 5 లక్షల రూపాయల వరకు పెంచడం, విశ్రాంత ఉద్యోగుల అసోసియేషన్ భవనాలకు ఆస్తి పన్ను రద్దు వంటి అంశాలపై 60 రోజుల్లో ఆదేశాలు ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పి మూడు మాసాలు కావస్తున్న ప్రభుత్వం నుండి ఎటువంటి ఆదేశాలు వెలువడలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఉగాది సందర్భంగా 12వ పిఆర్సి కమిటీ వేసి 30% మధ్యంతర భృతి ప్రకటించాలని వారు కోరారు. కొత్త పెన్షన్ విధానాన్ని రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్నే కొనసాగించాలని సమావేశం ప్రభుత్వాన్ని కోరింది. ఈ సమావేశంలో ఎల్ పాండురంగారావు, మధుసూదనరావు,ది జోనల్ మున్సిపల్ ఎంప్లాయిస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి ఏ. అప్పలరాజు, ఏలూరు సబ్ ట్రెజరీ ఆఫీసర్స్, ఏ టి వో జి సత్యనారాయణ, ఎస్ టి ఓ స్వరాజ్యమణి మాట్లాడారు. పద్మనాభరావుతోపాటు సుమారు 50 మంది విశ్రాంత ఉద్యోగులు పాల్గొన్నారు.

About Author