NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

షాదీఖానా స్థలాన్ని పరిశీలించిన డీఎంఓ సబీహా పర్వీన్..

1 min read

మిడుతూరు, (నందికొట్కూరు) న్యూస్​ నేడు   : నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని కడుమూరు గ్రామంలో ఉమ్మడి కర్నూలు జిల్లా మైనారిటీ వెల్ఫేర్ అధికారి సబీహా పర్వీన్ మరియు టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ కాకరవాడ చిన్న వెంకటస్వామి షాది ఖానాకు కేటాయించిన భూమిని శనివారం మధ్యాహ్నం పరిశీలించారు.ఈనెల 1వ తేదీన గ్రామానికి వచ్చిన నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరికి మైనారిటీ నాయకుల విజ్ఞప్తి మేరకు షాది ఖానా భూమిని మరియు గఉర్దూ పాఠశాలను పరిశీలించారు. భూమి సమస్యను పరిష్కరించాలని అదేవిధంగా పాఠశాలలో టీచర్ల తర్వాత ఉందని ఎంపీ దృష్టికి తీసుకువెళ్లగా వెంటనే ఎంపీ జిల్లా మైనారిటీ అధికారికి ఫోన్ ద్వారా విషయం తెలిపారు. అందుకు గాను డీఎంఓ భూమిని పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. తర్వాత ఉర్దూ పాఠశాలను తనిఖీ చేశారు.డీఎస్సీ ద్వారా పాఠశాలకు టీచర్లను నియమిస్తామని ఆమె హామీ ఇచ్చారు.ఉర్దూ పాఠశాల సమస్యలను పరిష్కరించాలని  మైనార్టీ నాయకులు అధికారి దృష్టికి తీసుకువచ్చారు.ఈ కార్యక్రమంలో మైనార్టీ సెల్ కార్యదర్శి సుల్తాన్,హిదాయతుల్లా, రహంతుల్లా,ఇద్రుస్ అజీజ్, సత్తార్,షఫీఉల్లా,అజ్మతుల్లా, ఇస్మాయిల్ పాల్గొన్నారు.

About Author