ఎస్జిఎఫ్ అండర్ 19లో కత్తి సాము, కర్ర సాము లో విద్యార్థుల ప్రతిభ
1 min read

చెన్నూరు ,న్యూస్ నేడు : ఎస్జీఎఫ్ సెలక్షన్లో భాగంగా అండర్ 19 బాలురు, బాలికలకు కత్తి సాము కర్రసాము సెలక్షన్స్ లలో భాగంగా మండలంలోని రామనపల్లె జిల్లా పరిషత్ పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలు ఉమా మహేశ్వరి దేవి ఆధ్వర్యంలో శనివారం పోటీలను సెలెక్షన్ కమిటీ ఫిజికల్ డైరెక్టర్ పోలంకి గణేష్ బాబు, ఫాతిమా, ప్రశాంతి, వసంత్, నాగేశ్వర్ రెడ్డి, తో పాటు ఎస్జిప్ అండర్ 19 సెక్రెటరీ చంద్రమౌళి రాజు, అండర్ 14 ,17 సెక్రటరీ చంద్రవతి , వివిధ మండలాల వ్యాయామ ఉపాధ్యాయుల పర్యవేక్షణలో ఈ పోటీలను నిర్వహించారు. ఈ పోటీలలో కత్తి సాముకు సంబంధించి రామనపల్లె జిల్లా పరిషత్ పాఠశాలకు చెందిన ఎనిమిదవ తరగతి చదువుతున్న నందిని, నాగచైతన్య, పదవ తరగతి చదువుతున్న సుశాంత్ విద్యార్థులు ప్రతిభ కనపరిచారు, అదేవిధంగా కరసాములో ఎనిమిదవ తరగతి చదువుతున్న శిరీష, 9వ తరగతి చదువుతున్న వరుణ్ లు ఎంపిక కావడం జరిగింది. ఎంపికైన విద్యార్థులు తమదైన శైలిలో ఈ పోటీలలో ప్రతిభ కనపరిచినందుకు ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు వారిని అభినందించారు. అలాగే జిల్లా స్థాయిలో రాణించాలని వారు విద్యార్థులను ప్రోత్సహించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.


