ఏపీ రాష్ట్ర శాలివాహన కార్పోరేషన్ డైరెక్టర్ కుమ్మరి సుధాకర్ ప్రమాణస్వీకారం
1 min read

ప్యాపిలి, న్యూస్ నేడు: విజయవాడ నగరంలోని గొల్లపూడి లోని బీసీ సంక్షేమ భవన్ లో ఆంధ్రప్రదేశ్ కుమ్మర శాలివాహన సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ లో నూతనంగా నియమింపబడిన డైరెక్టర్స్ ప్రమాణస్వీకారం మరియు పదవి భాద్యతల స్వీకారమహోత్సవం కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్బంగా ప్యాపిలి మండలంలోని గార్లదిన్నె గ్రామానికి చెందిన కుమ్మరి సుధాకర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాలివాహన కార్పొరేషన్ డైరెక్టర్ గా శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాలివాసన కార్పొరేషన్ డైరెక్టర్ గా నాకు ఇంత పెద్ద బాధ్యతలు పగించిన ముఖ్యమంత్రి నారాచంద్రబాబునాయుడు ,కి ఉపముఖ్యమంత్రి కొణిదెలపవన్_కళ్యాణ్ కి, ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారాలోకేష్ కి ,బీసీ మంత్రి సవిత కి ,డోన్ ఎమ్మెల్యే కోట్ల జయ సూర్య ప్రకాశ్ రెడ్డి కి ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు. అనంతరం మొదటి సర్వసభసమావేశం నిర్వహించి రాష్ట్ర వ్యాప్తంగా వున్న కుమ్మరి కుల వృత్తిదారుల సమస్యలను తెలుసుకొని సమస్యల పరిస్కార దిశగా పని చెయ్యాలని తెలిపారు. పెద్దలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రులు, ఎమ్మెల్యేలు నాపై నమ్మకంతో ఇంత పెద్ద బాధ్యతను కట్టిపెట్టినందుకు పార్టీకి నమ్మకంగా సేవలందిస్తూ, పార్టీ కోసం కష్టపడి తెదేపా పార్టీని బలోపితం నా వంతు నేను కృషి చేస్తు ,ప్రజలకు ఎన్నింట ఉండి సేవలు అందిస్తానని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో జెఎండి భీమశంకర్ మరియు జెఎండి ఉమాదేవి పాల్గొన్నారు.


