NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

భూమిని విషం గా మార్చకండి.. ఏవో

1 min read

అవగాహన సదస్సులో మాట్లాడుతున్న ఏవో

 చాగలమర్రి  రూరల్  న్యూస్​(నేడు): రైతులు తమ పంటలకు పరిమితికి మించి యూరియా తల్లి  భూమిని విషముగా మార్చకూడదని మండల వ్యవసాయ శాఖ అధికారి  రంగ నేతాజీ అన్నారు. బుధవారం ముత్యాలపాడు గ్రామంలో రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధిక రసానిక ఎరువులు వాడడం వలన కలిగే దుష్ప్రభావాలు గురించి  రైతులకు అవగాహన కల్పించారు. ముఖ్యంగా ప్రస్తుత ఆధునిక వ్యవసాయ సాగు పద్ధతులలో  రసాయనక ఎరువులు వాడకం తగ్గించాలన్నారు. సాగు చేస్తున్న పంట రకాలు, నీటిపారుదల, ఎరువుల యాజమాన్యం ద్వారా  దిగుబడి ఆధారపడుతుందన్నారు. కానీ కొన్ని చిన్న చిన్న సాగు చేసే విషయంలో లోపాలు చేయడం సహజమేనని వాటి కారణం చేత నేల కలుషితమయ్యే ప్రమాదం ఉందన్నారు. అందుకే రైతులందరూ యూరియా వాడకం సాధ్యమైనంత తక్కువగా  వినియోగించాలని కోరారు. సమగ్ర సస్యరక్షణ చర్యలు  పాటిస్తూ పంటలు సాగు చేయాలని మన భవిష్యత్తు తరాలకు  చౌడుబారిన  నేలను కాకుండా సారవంతమైన భూములను  అందించాలన్నారు. తక్కువ పెట్టుబడి తో  మంచి నాణ్యమైన దిగుబడులు సాధించడం లక్ష్యంగా ముందడుగు వేయాలని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ సహాయకులు సురేషు, రైతులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *