NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఖరీఫ్-2026 సీజన్‌కు సంబంధించిన ముందస్తు సన్నద్ధత

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  ఖరీఫ్-2026 సీజన్‌కు సంబంధించిన ముందస్తు సన్నద్ధతలో భాగంగా కర్నూలు ఉపవిభాగ ఇన్‌పుట్ డీలర్ల సమావేశం ఉద్యాన భవన్, కర్నూలులో జిల్లా వ్యవసాయ అధికారి శ్రీమతి పి. ఎల్. వరలక్ష్మి అధ్యక్షతన నిర్వహించబడింది.ఈ సమావేశంలో టెక్నికల్ ఏఓ శ్రీ శ్రీవర్ధన్ రెడ్డి, కొడుమూరు వ్యవసాయ అధికారి శ్రీ రవి ప్రకాష్, కల్లూరు వ్యవసాయ అధికారి శ్రీ విష్ణువర్ధన్, కర్నూలు వ్యవసాయ అధికారి శ్రీ రూఫస్ రోనాల్డ్, ఓర్వకల్ వ్యవసాయ అధికారి శ్రీమతి మధుమతి, బెలగల్ వ్యవసాయ అధికారి శ్రీ మల్లేష్ కుమార్ పాల్గొన్నారు. ఉపవిభాగ పరిధిలోని ఇన్‌పుట్ డీలర్లు సమావేశానికి హాజరయ్యారు.ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ అధికారి శ్రీమతి పి. ఎల్. వరలక్ష్మి డీలర్లకు క్రింది సూచనలు చేశారు:

  1. విత్తనాలు మరియు ఎరువుల స్టాక్ రిజిస్టర్లు సక్రమంగా నిర్వహించాలి.2. బిల్ బుక్స్ మరియు ఈ-పాస్ విక్రయాల నమోదులను సరిగా నిర్వహించాలి.3. డీబీటీ నమోదు చేసిన వివరాలు జారీ చేసిన బిల్లులకు పూర్తిగా అనుగుణంగా ఉండాలి.4. పానిక్ సేల్స్ చేయరాదు.5. అనధికారిక అంతర్రాష్ట్ర ఎరువుల రవాణా నిషేధం.6. సబ్సిడీ ఎరువులను పారిశ్రామిక అవసరాలకు మళ్లించరాదు.7. ఎల్‌నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఎరువులు మరియు ఇతర వ్యవసాయ ఇన్‌పుట్లను పొదుపుగా, శాస్త్రీయ పద్ధతిలో వినియోగించేలా రైతులకు అవగాహన కల్పించాలి.8. అధిక మోతాదులో యూరియా వినియోగించకుండా రైతులకు సూచనలు ఇవ్వాలి. అవసరానికి మించి యూరియా వినియోగించడం వల్ల చీడపీడలు మరియు వ్యాధులు పెరిగి రైతుల సాగు ఖర్చులు అధికమయ్యే అవకాశం ఉందని తెలిపారు.9. “భారతి మాత బచావో”లో భాగంగా నేల ఆరోగ్యం మరియు పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. 

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *