ఆనాటి తప్పిదాలే..భూ సమస్యలు
1 min read
49బన్నూరు’లో పొలం పాస్ పుస్తకాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే..
మిడుతూరు నందికొట్కూరు(న్యూస్ నేడు): గత వైకాపా ప్రభుత్వంలో చేసిన తప్పిదాలే నేడు భూ సమస్యలతో రైతన్నలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య అన్నారు. నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని 49 బన్నూరు గ్రామంలో సోమవారం సాయంత్రం’మీభూమి-మీ హక్కు’కార్యక్రమంలో భాగంగా 639 రాజముద్ర తో కూడిన పొలం పాస్ పుస్తకాలను ఎమ్మెల్యే రైతులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో రైతులకు నోటీసులు ఇవ్వకుండానే రీ సర్వే చేయడంతో భూ సమస్యలు అధికమయ్యాయని ఇనాం భూములకు త్వరలోనే ప్రభుత్వం మంచి శుభవార్త చెబుతుందని 22 ఏ భూములను ఒక నెల పొడిగించడం జరిగింది రాబోయే రోజుల్లో వాటిపై కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు.గత ఎన్నికల ముందు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నింటిని నెరవేర్చామని గత ప్రభుత్వంలో వెయ్యి రూపాయల పింఛన్ పెంచడానికి ఐదు సంవత్సరాలు తీసుకున్నారని ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఒకేసారి అన్ని రకాల పింఛన్లను పెంచిన ఘనత దక్కిందన్నారు.ఇక్కడ 32 లక్షలతో పంచాయతీ కార్యాలయానికి భూమి పూజ చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో దశరథ రామయ్య,తహసిల్దార్ శ్రీనివాసులు,మండల కన్వీనర్ ఖాతా రమేష్ రెడ్డి, సహకార సొసైటీ చైర్మన్ వెంకటేశ్వర రెడ్డి,సంపంగి రవీంద్రబాబు,నాగేంద్ర,వీరారెడ్డి,నరసింహ గౌడ్,శబ్బు గ్రామ నాయకులు రమణారెడ్డి,సోఫీ సాహెబ్,నబీ రసూల్, వీఆర్వో సోఫీ,పంచాయతీ కార్యదర్శి సుంకన్న మరియు అధికారులు పాల్గొన్నారు.


