ఘనంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి వేడుకలు
1 min read

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కార్యక్రమం
వివిధ ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున పాల్గొన్న దళిత నాయకులు
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: అంబేడ్కర్ ఆశయాలు సాధించిన రోజే ఆయనకు నిజమైన ఘన నివాళులు దళిత ,బహుజన సంఘాల జేఏసీ నాయకులు శనివారం డాక్టర్ బీ.ఆర్. అంబేడ్కర్ 69 వ వర్ధంతి సందర్భంగా ఏలూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో గల డాక్టర్ బీ.ఆర్. అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిఅనంతరం దళిత బహుజన నాయకులు దాసరి ఆంజనేయులు, మెండెం సంతోష్ కుమార్ నేతల రమేష్ బాబు అబ్బూరి అనీల్ కుమార్ లు మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నాయకులు అంతా ఐక్యమై అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా పనిచేసి రాజ్యాధికారం సాధించిన రోజే ఆయనకు నిజమైన ఘన నివాళులు అర్పించిన వారం అవుతాం అని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో దాసరి నాగేంద్ర కుమార్ ప్రొఫెసర్ ఎన్ఏడి పాల్ పల్లెం ప్రసాద్, మేతర అజయ్ బాబు, మెండెం ఆనంద్, గొల్ల కిరణ్, దాసి వెంకటేశ్వర్లు, జక్కుల బెనర్జీ, కర్రే అంబేద్కర్,కుర్మా రాజు, కర్నకోటి దిలీప్ కుమార్, కొరబండి బాబురావు,మత్తే బాబి,సొంగ మధు,తదితరులు పాల్గొన్నారు.

