NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

భారతాదేశం గర్వించదగ్గ వ్యక్తులలో అంబేద్కర్ ఒకరు

1 min read

హొళగుంద న్యూస్ నేడు : హోళగుంద మండలంలో భారతరత్న డాక్టర్ బి ఆర్ అంబేద్కర్  వర్ధంతి సందర్భంగా ఆయనను స్మరించుకుంటూ సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఆలూరు అసెంబ్లీ అధ్యక్షులు ఎఫ్ హమీద్ అంబేద్కర్ విగ్రహాన్ని పూలమాల వేసి సత్కరించారు. ఎఫ్, హమీద్ మాట్లాడుతూ భారతాదేశం గర్వించదగ్గ వ్యక్తులలో అంబేద్కర్ ఒకరని మన దేశ రాజ్యాంగ నిర్మాత  మరియు భారత రాజ్యాంగ ముసాయిదా కమిటీ చైర్మన్ గాను సేవలందించారు. భారతదేశ మొట్ట మొదటి న్యాయశాఖ మంత్రిగా పని చేశారు దేశంలో అంటరానితనం కుల నిర్మూలనకై ఎంతగానో కృషి చేశారు ఇంతటి మహనీయుడైన వ్యక్తి విగ్రహాన్ని మండల పరిధిలోని ఎల్లార్తి గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడటం జరిగింది. వారిని పట్టుకొని కఠినంగా శిక్షించాలని అలాగే కొన్ని వందల సంవత్సరాల చరిత్ర కలిగిన బాబ్రీ మసీదు కూల్చివేతకు నేటికి 33 సంవత్సరాలు అని గుర్తు చేస్తూ న్యాయం నిరాకరించబడిందని, నమ్మకానికి ద్రోహం చేశారు అని బాబ్రీ మసీదు కోసం పోరాటం ఎప్పటికీ ముగియదని అన్నారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ  కార్యదర్శి .హఫీజ్ కార్యవర్గ సభ్యులు, ఎం రహమతుల్లా,వాజిద్ మహేఫ్స్ పార్టీ కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు.

About Author