NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అమెరికా ఐవీఎల్​పీ కి డా. వినూష రెడ్డి ఎంపిక

1 min read

భారతదేశ ప్రజాస్వామ్యం గురించి అమెరికాకు తెలియజేస్తా..

  • బీజేపీలోనే మహిళలకు ప్రాధాన్యం…
  • ప్రధాని నరేంద్రమోదీకి, రాష్ట్ర పెద్దలకు కృతజ్ఞతలు
  • బీజేపీ ఏపీ అధికార ప్రతినిధి డా. వినూష రెడ్డి

కర్నూలు, న్యూస్​ నేడు:  దేశ రాజకీయాలు, సమాజంలో మహిళల పాత్ర  గురించి అమెరికాలో నిర్వహిస్తున్న ప్రతిష్టాత్మక ఇంటర్నేషనల్ విజిటర్ లీడర్ షిప్  ప్రోగ్రాము(IVLP) లో వెల్లడించేందుకు తనను ఎంపిక చేశారని బీజేపీ ఏపీ అధికార ప్రతినిధి డా. వినూష రెడ్డి తెలిపారు.  నగరంలోని మౌర్య ఇన్​ లో  సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు.  అమెరికా డిపార్టుమెంటు అఫ్ స్టేట్ నిర్వహిస్తున్న IVLP కార్యక్రమానికి ప్రపంచ వ్యాప్తంగా 20 మంది మహిళా నాయకురాళ్లను ఎంపిక చేశారని, అందులో భారత దేశం తరుపున కర్నూలుకు చెందిన తనను ఎంపిక చేయడం సంతోషంగా ఉందన్నారు.  జపాన్, జర్మనీ, పోలాండ్, అర్జేంటినా, ఉక్రైయన్, బల్గేరియ, సింగపూర్, లెబనాన్, ఇరాక్, సౌత్ కొరియా, సౌత్ ఆఫ్రికా మరియు తైవాన్ దేశాల ప్రతినిధులు పాల్గొనుచున్నారు.  ఆగష్టు 11వ తేది నుండి ౩౦వ తేది మధ్య నిర్వహించే  IVLP పూర్వ ప్రతినిధుల సమూహములో భారత దేశపు ప్రముఖ నాయకులలో ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోది, పూర్వ ప్రధానులు మోరార్జీ దేశాయ్, అటల్ బిహారి వాజ్ పాయ్ మరియు ఇందిరా గాంధీ  విశిష్ట వ్యక్తులు. వివిధ ఇతర దేశాధినేతలు & నోబెల్ ప్రైజ్ గ్రహీతలు కూడా పాల్గొన్నారని ఈ సందర్భంగా ఆమె వెల్లడించారు.  ప్రస్తుతం ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలో మహిళాభ్యున్నతికి పెద్ద పీట వేస్తారని,  ఇప్పటికే చట్ట సభలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్​ వంటి గొప్ప నిర్ణయాలు తీసుకున్నారని పేర్కొన్నారు.  అంతర్జాతీయ కార్యక్రమానికి తాను ఎంపిక కావడం గొప్ప అవకాశంగా భావిస్తున్నానని చెప్పిన ఏపీ బీజేపీ అధికార ప్రతినిధి డా. వినూష రెడ్డి… కేంద్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో మహిళల భాగస్వామ్యం పెంచడానికి ఇస్తున్న ప్రోత్సహాన్ని కార్యక్రమంలో వెల్లడిస్తానన్నారు. రాజకీయాల్లో తన ఎదుగుదలకు సహకరించిన  రాజ్య సభ మాజీ సభ్యులు టి.జి. వెంకటేష్​, ఆదోని ఎమ్మెల్యే డా. పార్థసారధి, బీజేపీ రాష్ట్ర పెద్దలకు ఈ సందర్భంగా డా. వినూష రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు.

About Author