NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మంత్రి టీజీ భరత్  జన్మదినం సందర్భంగా  వేద పండితుల ఆశీర్వచనం

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:    టీజీ భరత్ రాష్ట్ర పారిశ్రామిక వాణిజ్య ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రివర్యుల వారి జన్మదినం పురస్కరించుకొని కర్నూల్ నగర బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు   డేల్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో వేద పండితలతో కలిసి వారి ఇంటి యందు వేద ఆశీర్వచనం చేయడం జరిగినది . ఇదే సందర్భంలో వారికి సంకల్ బాగ్ వెంకటేశ్వర స్వామి దేవాలయం నందు జరుగు పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరిస్తూ ఇంకా కొన్ని పనులకు తమరి సహాయ సహకారాలు అందిస్తూ దేవాలయ అభివృద్ధికి తోడ్పాలని భక్తుల సంతకాలతో సేకరించిన ఒక అర్జీని మంత్రివర్యులకు సమర్పించడం జరిగినది అందుకు వారు  సంతోషించి ఈ కార్యక్రమాన్ని  ఈ అర్జిని నేను పరిశీలించి చూస్తాను అని చెప్పి చెప్పడం జరిగింది. అనంతరం శ్రీ టీజీ వెంకటేష్  మాజీ రాజ్యసభ సభ్యులు వారిని కూడా గౌరవపూర్వకంగా కలవడం వారికి కూడా వేద ఆశీర్వచనం అందించడం జరిగింది.   ఈ కార్యక్రమం నందు గౌరవాధ్యక్షులు చెరువు వెంకట దుర్గా ప్రసాద్  మరియు ప్రధాన కార్యదర్శి చల్లా నాగరాజ్ శర్మ  మరియు ఉపాధ్యక్షులు కంచు గంటల శ్యాంసుందర్ రావు   కోశాధికారి సిఎస్ ప్రసాద్ రావు , సలహాదారు శ్రీ టీవీ రవిచంద్ర శర్మ  సముద్రాల శ్రీధర్ , మెంబర్లు రాధాకృష్ణ  ఆనందరావు శ్రీనివాసరాజు  మరియు దేవాలయ అర్చకులు శ్రీ ప్రసన్న  మహేష్  గురు రాజా చారి  టీ శివన్న మేనేజర్, వేద పండితులు బ్రాహ్మణ బంధువులు పాల్గొనడం జరిగింది.

About Author