వాట్సాప్ సమాచారానికి వెంటనే స్పందించిన ఈబీజీ గోవింద్ గౌడ్
1 min read
నెరణికి గ్రామానికి రెండు తాగునీటి ట్యాంకర్ల పంపిణీ – దాహార్తి తీర్చిన టీడీపీ నాయకత్వం
ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యం – శాశ్వత పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటాం : ఈబీజీ గోవింద్ గౌడ్
హోళగుంద న్యూస్ నేడు: కర్నూలు జిల్లాఆలూరు తాలూకా, హొళగుంద మండలంలోని నెరణికి గ్రామంలో తీవ్రమైన తాగునీటి సమస్య నెలకొన్నట్లు సామాజిక మాధ్యమాల ద్వారా సమాచారం అందిన వెంటనే ఆలూరు నియోజకవర్గ తెలుగు దేశం పార్టీ సీనియర్ నాయకుడు ఈబీజీ గోవింద్ గౌడ్ స్పందించారు. ప్రజల ఇబ్బందులను గుర్తించి ఎలాంటి ఆలస్యం చేయకుండా రెండు తాగునీటి ట్యాంకర్లను గ్రామానికి పంపించి అత్యవసరంగా తాగునీటి సరఫరా చేయించారు.ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు అవసరమైన తాగునీటిని అందిస్తూ వారి దాహార్తిని తీర్చేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఈ సేవా కార్యక్రమంలో తెలుగు దేశం పార్టీ యువనాయకుడు ఈబీజీ రాజేంద్ర గౌడ్ కూడా పాల్గొని గ్రామ ప్రజలకు అండగా నిలిచారు.ప్రజల సమస్యలను తమ సమస్యలుగా భావిస్తూ, అవసరమైన ప్రతి సందర్భంలో వెంటనే స్పందించడం తమ బాధ్యత అని ఈబీజీ గోవింద్ గౌడ్ మరోసారి నిరూపించారు. ప్రజలకు అవసరమైన సేవలను అందించడంలో ఎల్లప్పుడూ ముందుండే నాయకత్వంగా ఆయన సేవాభావాన్ని గ్రామస్తులు అభినందించారు.ఈ సందర్భంగా ఈబీజీ గోవింద్ గౌడ్ మాట్లాడుతూ, నెరణికి గ్రామంలో నెలకొన్న తాగునీటి సమస్యను వెంటనే ఆలూరు నియోజకవర్గ తెలుగు దేశం పార్టీ ఇన్‌చార్జ్ వైకుంఠం జ్యోతి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. గ్రామ ప్రజలకు శాశ్వత పరిష్కారం లభించేలా సంబంధిత అధికారులతో మాట్లాడి అవసరమైన చర్యలు చేపడతామని చెప్పారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, త్వరలోనే ఈ సమస్యకు పూర్తి స్థాయి పరిష్కారం చూపేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.ఈ సందర్భంగా నెరణికి గ్రామ ప్రజలు మాట్లాడుతూ, “ఒక వాట్సాప్ సమాచారం అందగానే వెంటనే స్పందించి రెండు తాగునీటి ట్యాంకర్లను పంపించిన ఈబీజీ గోవింద్ గౌడ్, ఈబీజీ రాజేంద్ర గౌడ్‌లకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు. ప్రజల కోసం ఇలాగే నిరంతరం సేవ చేస్తూ ఉండాలని కోరుకుంటున్నాం” అని తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.గ్రామ ప్రజల కష్టసుఖాల్లో భాగస్వాములై, సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుంటున్న టీడీపీ నాయకత్వంపై నెరణికి గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.



