NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మాదకద్రవ్యాల వినియోగాన్ని నిర్మూలించాలి

1 min read

కర్నూలు, న్యూస్ ​నేడు: డ్రగ్ దుర్వినియోగం మరియు అక్రమ రవాణాకు వ్యతిరేకంగా అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా చట్టపరమైన అవగాహన కార్యక్రమం.విశ్వ భారతి మెడికల్ కాలేజీ పెంచికలపాడు వారు అంతర్జాతీయ మదకద్రవ్యా దుర్వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సదస్సుకు ముఖ్య అతిథులుగా  జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకట శేషాద్రి మరియు శాశ్వత లోక్ అదాలత్ చైర్మన్ వెంకట హరినాథ్  హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకట శేషాద్రి  (మాదకద్రవ్యాల దుర్వినియోగం మరియు మాదక ద్రవ్యాల నిర్మూలన బాధితులకు న్యాయ సేవలు) పథకం, 2015 గురించి వివరించారు.  అందరూ ఆలోచించి ఇతరులను ఆలోచింపచేసి మీవంతు సహాయ సహకారాలను అందిస్తూ మాదకద్రవ్యాల వినియోగాన్ని నిర్మూలించాలని, తద్వారా మనదేశ సమగ్రాభివృద్ధికి తోడ్పడాలని కోరారు. డ్రగ్స్… మాదక ద్రవ్యాలు… ఈ మాట విననివాళ్లు లేదా ఈ పేరు తెలియనివాళ్లు అరుదు. తమాషాగా మొదలై అది లేకుంటే బ్రతకలేమనేంత బానిసలుగామార్చే శక్తి ఈ మహమ్మారి డ్రగ్స్ కు కలదని తెలిపారు. అనంతరం మెడికల్ కాలేజీ విద్యార్థులకు ర్యాగింగ్ యొక్క  దుష్ప్రభావాల గురించి విద్యావ్యవస్థలలో ర్యాగింగ్ దానికి సంబంధించిన శిక్ష లు  నిబంధనలు మరియు ర్యాగింగ్ కు పాల్పడిన వ్యక్తులపై భారతీయ  శిక్షాస్మృతి ప్రకారం వారికి జైలు శిక్ష లేదా జరిమాన  లేదా రెండు విధింపబడతాయని తెలిపారు నేరం యొక్క తీవ్రతను బట్టి శిక్ష పరిణామం మారుతుందని తెలియజేశారు. ముఖ్యంగా విద్యార్థులు ర్యాగింగ్ లో పాల్గొన్న అందుకు ప్రోత్సహించిన వారికి శిక్ష విధింపబడుతుందని దీనివల్ల విద్యార్థులకు భవిష్యత్తులో సమస్యలు ఏర్పడతాయని తెలియజేశారు. విశ్వభారతి మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ కృష్ణ నాయక్ మాట్లాడుతూ వివిధ వయసులవారు, రకరకాల స్థాయిల్లో ఉన్నవారు ఈ మత్తుపదార్ధాల బారినపడి అన్ని రకాలుగా పతనమౌతూ, తమ కుటుంబ సభ్యులకు మనోవేదన మిగులుస్తున్నారన్నారు.  సైక్రియాటిస్ట్  డాక్టర్ శివశంకర్ రెడ్డి మాట్లాడుతూ ఈ డ్రగ్స్ మాఫియాలు విద్యాసంస్థల్ని, వాటిలోని విద్యార్థుల్ని లక్ష్యంగా చేసుకొని విచ్చలవిడిగా చెలరేగిపోతున్నయన్నారు . నోడల్ ఆఫీసర్ డాక్టర్ మునీరుద్దీన్  మాట్లాడుతూ  డ్రగ్ దుర్వినియోగం మరియు అక్రమ రవాణా గురించి మరియు మాదకద్రవ్యాల వాడకం వలన వచ్చే దుష్పరిణామాల  గురుంచి వివరించి దాని వలన వచ్చే ప్రమాదాల గురుంచి అవగాహనా కల్పించారు. మాదకద్రవ్యాలను వాడటం వలన వారు తనను తానూ అదుపు తప్పి వారందరూ ఆరోగ్యాన్ని చెడకోట్టుకొని జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. డ్రగ్స్ వాడకం వల్ల కలిగే దుష్ప్రభావాలపై అవగాహన కల్పించారు. శాశ్వత లోక్ అదాలత్ చైర్మన్ వెంకట హరినాథ్  ప్రజా వినియోగ సేవల కోసం ఈ శాశ్వత లోక్ అదాలత్ పనిచేస్తుందని తెలిపారు.న్యాయ సేవా సంస్థల చట్టం 1987 లో పేర్కొన్న 10 సేవలు పై అవగాహన కల్పించారు. అనంతరం ప్యారా లీగల్ వాలంటీర్  డాక్టర్ రాయపాటి శ్రీనివాసరావు  ర్యాగింగ్ కు వ్యతిరేకంగా మరియు అంతర్జాతీయ మాదకద్రయ్య వ్యతిరేక దినోత్సవం పై విద్యార్థులతో ప్రతిజ్ఞ  నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విశ్వ భారతి మెడికల్ కాలేజీ ప్రొఫెసర్లు డాక్టర్లు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

About Author