పేదల పాలిట అండగా ఈబీజీ గోవింద్ గౌడ్ – సేవే లక్ష్యంగా నిరంతర ప్రజాసేవ
1 min read
పేద కుటుంబాల పెండ్లిళ్లకు ఆర్థిక సహాయం – ఆలయాలు, , దర్గాలు, దేవాలయాలకు విరాళాలు – ఆపదలో ఉన్నవారికి అండగా నిలుస్తున్న ప్రజానాయకుడు
హోళగుంద న్యూస్ నేడు: ఆలూరు నియోజకవర్గంలోహోళగుంద మండలం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు ఈబీజీ గోవింద్ గౌడ్ ప్రజాసేవను తన ధ్యేయంగా భావిస్తూ నిరంతరం పేద ప్రజలకు అండగా నిలుస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులతో పెండ్లిళ్లు నిర్వహించలేని నిరుపేద కుటుంబాలకు ఆర్థిక సహాయం అందిస్తూ వారి ఆనందంలో భాగస్వామి అవుతున్నారు.అంతేకాకుండా గ్రామాల్లోని దేవాలయాలు, మసీదులు, దర్గాలు మరియు ఇతర ప్రార్థనా మందిరాల అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తూ సామాజిక సామరస్యానికి కృషి చేస్తున్నారు. అవసరమైన సమయంలో విరాళాలు అందించి ధార్మిక కార్యక్రమాలకు ప్రోత్సాహం ఇస్తున్నారు.ఎవరైనా కష్టాల్లో ఉన్నారని తెలిసిన వెంటనే వారి వద్దకు చేరుకుని తనకు చేతనైన సహాయం చేయడం ఈబీజీ గోవింద్ గౌడ్ ప్రత్యేకతగా నిలిచింది. విద్య, వైద్యం, కుటుంబ అవసరాలు వంటి అనేక సందర్భాల్లో ఆయన అందిస్తున్న సహాయం వల్ల ఎన్నో పేద కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయి.ప్రజల కష్టసుఖాల్లో భాగస్వామిగా ఉంటూ సేవాభావంతో ముందుకు సాగుతున్న ఈబీజీ గోవింద్ గౌడ్ సేవలను స్థానిక ప్రజలు ప్రశంసిస్తూ, ఇలాంటి నాయకులు సమాజానికి ఆదర్శమని అభిప్రాయపడుతున్నారు.


