తెదేపా పార్టీ బలోపేతానికి కృషి చేయాలి
1 min read
మంత్రాలయం టీడీపీ ఇంచార్జి రాఘవేంద్ర రెడ్డి
మంత్రాలయం న్యూస్ నేడు : తెదేపా పార్టీ బలోపేతానికి కలిసి కట్టుగా కృషి చేయాలని మంత్రాలయం టిడిపి ఇన్చార్జ్ మాధవరం రాఘవేంద్ర రెడ్డి పేర్కొన్నారు. బుధవారం మండల పరిధిలోని మాధవరం గ్రామంలో టిడిపి కార్యాలయంలో మంత్రాలయం కు చెందిన తిక్కారెడ్డి వర్గం ముఖ్య అనుచరుడు గొబ్రు చిన్న భీమన్న, పెద్ద భీమన్న తన 50 మంది వర్గం తో టిడిపి సీనియర్ నాయకులు అశోక్ రెడ్డి, మంచాల సొసైటీ డైరెక్టర్ డిసి తిమ్మప్ప అధ్వర్యంలో రాఘవేంద్ర రెడ్డి వర్గం లో చేరారు. వీరికి రాఘవేంద్ర రెడ్డి, మాజీ సర్పంచ్ రఘునాథ్ రెడ్డి సాదరంగా ఆహ్వానం పలికారు. చిన్న భీమన్న రాఘవేంద్ర రెడ్డి, మాజీ సర్పంచ్ రఘునాథ్ రెడ్డి, యువ నాయకులు రాఖేష్ రెడ్డి లను భారీ గజ మాలతో శాలువ కప్పి ఘనంగా సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మంత్రాలయం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ మరింత బలోపేతానికి కలిసి కట్టుగా కృషి ఒకే వర్షం గా ఉండాలని సూచించారు. పార్టీ విజయమే లక్ష్యంగా, విభేదాలకు స్వస్తి పలకాలని సూచించారు. తెలుగుదేశం పార్టీ బలోపేతమే ధ్యేయంగా,వ్యక్తిగత భేదాలను పక్కన పెట్టి ఒకే జెండా కింద కలిసి పనిచేయాలని సూచించారు. అలాగే రానున్న రోజుల్లో మంత్రాలయం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని మరింత బలంగా తీర్చిదిద్దేందుకు అందరూ సమిష్టిగా కృషి చేయాలనీ తెలిపారు. అనంతరం చిన్న భీమన్న మాట్లాడుతూ రాఘవేంద్ర రెడ్డి నాయకత్వంపై పూర్తి విశ్వాసం వ్యక్తం చేశారు. పార్టీ అభివృద్ధి కోసం భుజం భుజం కలిపి ముందుకు సాగుతామని ఐక్యంగా ఉండి స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే ధ్యేయం గా పని చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు రఘు,శివ, డేవిడ్, పేతురు, మేకల నరసింహులు మరియు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


