95 టన్నుల యూరియా పంపిణీ
1 min read

మహానంది, న్యూస్ నేడు: మహానంది మండలం లోని రైతులకు దాదాపు 95 టన్నుల యూరియా శుక్రవారం పంపిణీ చేశారు. ఇందులో భాగంగా వ్యవసాయ శాఖ అధికారులు మహానంది మండలానికి 4 గ్రామాలకు సంబంధించి 95 టన్నుల యూరియాను బొల్లవరం, తమడ పల్లె, బుక్కాపురం, తిమ్మాపురం తదితర గ్రామాల రైతులకు టోకెన్లు (స్లాట్ బుకింగ్) విధానంలో గురువారం అందజేసి దాని ప్రకారం శుక్రవారం ఉదయం నుండి యూరియా సాయంత్రం వరకు పంపిణీ చేశారు .యూరియా పంపిణీ కార్యక్రమాన్ని మండల తహసీల్దార్ రమాదేవి, మండల వ్యవసాయ శాఖ అధికారి నాగేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం పంపిణీ కార్యక్రమం చేపట్టగా పోలీసులు పంపిణీ సమయంలో రైతుల మధ్య ఎలాంటి విభేదాలు తలెత్తకుండా, పక్కదారి పట్టకుండా, ఎలాంటి ఆరోపణలు వెల్లువెత్తకుండా, వ్యవసాయ, రెవెన్యూ, పోలీస్ శాఖ సంయుక్తంగా ముందు జాగ్రత్త చర్యలో భాగంగా పంపిణీ, భద్రత, నిఘా ఏర్పాటు చేయడంతో ప్రశాంతంగా పంపిణీ పూర్తయినట్లు తెలుస్తుంది.

