NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రోటరీ క్లబ్ ఆఫ్ నూజివీడు ఆధ్వర్యంలో కృత్రిమ కాళ్ళు అమర్చేందుకు  స్క్రీనింగ్ క్యాంప్ 

1 min read

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: రోటరీ క్లబ్ ఆఫ్ నూజివీడు మ్యాంగో టౌన్, నూజివీడు వారి ఆధ్వర్యంలో  గురువారం నిర్వహించిన కృత్రిమ కాళ్ళ అమర్చేందుకు స్క్రీనింగ్ క్యాంపు లో 36 మందికి కృత్రిమ కాళ్ళు అమర్చేందుకు ఎంపిక చేయడం జరిగిందని  రోటరీ క్లబ్ అఫ్ నూజివీడు మ్యాంగో టౌన్ అధ్యక్షులు ఎస్.శశికాంత్   తెలిపారు. నూజివీడు పట్టణంలోని రోటరీ ఆడిటోరియం లో నిర్వహించిన స్క్రీనింగ్ క్యాంపు నకు 40 మంది హాజరయ్యారని, వీరిలో 36 మందికి కృత్రిమా కాళ్ళు అమర్చేందుకు ఎంపిక చేసి, వారికి సరిపడా కృత్రిమ కాళ్ళు సైజు కొలతలు తీసుకోవడం  జరిగిందన్నారు.మిగిలిన 4 గురు ఇటీవలే  ఆపరేషన్ చేయించుకున్నందున, మరికొంత కాలం ఆగవలసి ఉంటుందని వారికి తెలియజేయడం జరిగిందన్నారు. ఎంపిక చేసిన వారికి త్వరలో కృత్రిమ కాళ్ళు అమర్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ అధ్యక్షుడు సజ్జా శశి కాంత్, కార్యదర్శి మండా శ్రీనివాస్,పిడి వెంకట రత్నం,బోయపాటి ముఖర్జీ, అనిల్, లక్షణ స్వామి,రాజగోపాల్, మలిశెట్టి శ్రీనివాస్,పొట్లూరి ప్రసాద్, సాయి భాస్కర్, వెంకటేశ్వర రావు,సబ్బినేని శ్రీనివాస్, నరేంద్ర,లావు మురళీ పాల్గొన్నారు.

About Author