NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఏలూరు జిల్లాను రాష్ట్ర స్థాయిలో మొదటి 3 స్థానాలలో నిలపాలి…

1 min read

జిల్లా కలెక్టర్ కె వెట్రీ సెల్వి

ఎంపీ పుట్టా మహేష్ తో జిల్లాస్థాయి సమీక్ష కమిటీ సమావేశం

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: జిల్లా వార్షిక రుణ ప్రణాలిక లో వ్యవసాయ, అనుబంధరంగాలకు నిర్దేశించిన రుణ లక్ష్యాలను నూరు శాతం సాధించి ఏలూరు జిల్లాను రాష్ట్ర స్థాయిలో మొదటి 3 స్థానాలలో నిలపాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి  అధికారులను, బ్యాంకర్లను కోరారు.  స్థానిక కలెక్టరేట్లోని గౌతమీ సమావేశపు హాలులో శుక్రవారం జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి అధ్యక్షతన జరిగిన జిల్లా స్థాయి సమీక్ష కమిటీ (బ్యాంకర్స్) సమావేశంలో ఏలూరు పార్లమెంట్ సభ్యులు పుట్టా మహేష్ కుమార్ తో కలిసి  బ్యాంకర్ల వార్షిక రుణ ప్రణాళిక లక్ష్యాలను  కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ  2025-26 జిల్లా వార్షిక  రుణ ప్రణాళికలో ప్రాధాన్యత రంగాలైన వ్యవసాయ, అనుబంధ రంగాలకు  17 వేల 431 కోట్ల రూపాయలు రుణాలు  లక్ష్యం కాగా, సెప్టెంబర్ నాటికి  64. 66 శాతం మేర 8 వేల 952 కోట్ల రూపాయలు అందించారని, ఫిబ్రవరి నాటికి నూరు శాతం లక్ష్యాలను సాధించే దిశగా కృషిచేయాలన్నారు.   జిల్లాలోని  15 వేల 535 స్వయం సహాయక సంఘాలకు 1421. 17 కోట్ల రూపాయల రుణాల లక్ష్యానికి గాను 13 వేల  562 సంఘాలకు 1233. 67 కోట్ల రూపాయలు రుణాలుగా అందించారన్నారు. స్వయం సహాయక సంఘాల సభ్యులు పొందిన రుణాలతో స్వయం ఉపాధి యూనిట్లు ఏర్పాటుచేసుకుని ఆర్థికాభివృద్ధి చెందేలా అధికారులు, బ్యాంకర్లు చర్యలు తీసుకోవాలన్నారు.   బ్యాంకర్లు వార్షిక రుణ ప్రణాళిక విడుదల సమయంలో నియోజకవర్గాల స్థాయిలో ఏ పధకానికి ఏ మేర లక్ష్యాలు నిర్దేశించారన్న విషయాన్నీ సంబంధిత ఎమ్మెల్యేలకు తెలియజేయాలన్నారు. తిరస్కరించినందుకు గల కారణాలు తెలుసుకుని వాటిని సరిదిద్ది మరల దరఖాస్తు చేయించి మంజూరు చేయాలనీ ఎంపీ బ్యాంకర్లు, ట్రాన్స్కో అధికారులకు సూచించారు. ఉంగుటూరు శాసనసభ్యులు పత్సమట్ల ధర్మరాజు మాట్లాడుతూ సిసిఆర్సీ కార్డులు జారీ చేసిన ప్రతీ  కౌలు రైతుకు సాగుకు రుణాలు అందించాలన్నారు.  పిఎం స్వనిది కి దరఖాస్తు చేసుకున్న వారికీ, ప్రధానమంత్రి సూర్యఘర్ యోజనలో సౌర విద్యుత్  వినియోగాన్ని ప్రోత్సహించేందుకు  దరఖాస్తు చేసుకున్న వారికి సిబిల్ స్కోర్ తో సంబంధం లేకుండా రుణాలు అందించాలన్నారు. కార్యక్రమంలో ఆర్బీఐ డిజిఎం అభిషేక్, యూనియన్ బ్యాంకు అఫ్ ఇండియా రీజనల్ హెడ్ ఎన్ . శ్రీనివాస్, ఎల్డిఎమ్ నీలాద్రి,  నాబార్డ్ డిడిఎమ్ అనిల్ కాంత్, ఎల్డిఎమ్ నీలాద్రి, ట్రాన్స్కో ఎస్ఈ సాల్మన్ రాజు,  పరిశ్రమల శాఖ జిల్లా మేనేజర్ వెంకటరావు, వ్యవసాయాధికారి హబీబ్ భాష, డిఆర్డిఏ పీడీ విజయరాజు,  ఉద్యానవనాల శాఖ డిడి షాజా నాయక్, సెట్వేల్ సీఈఓ ప్రభాకర్, ఎస్పీ కార్పొరేషన్ ఈడీ ముక్కంటి,   బ్యాంకర్లు,వివిధ శాఖల అధికారులు,ప్రభృతులు పాల్గొన్నారు.

About Author