ఘనంగా ఎర్రగుడి ఈశ్వర్ రెడ్డి 47వ వర్ధంతి సభలు
1 min read
న్యూస్ నేడు, పత్తికొండ: పత్తికొండ సిపిఎం మాజీ శాసనసభ్యులు, దివంగత ఎర్రగుడి ఈశ్వర్ రెడ్డి 47 వ వర్ధంతి సభలు పత్తికొండ నియోజకవర్గంలోని ఆయా మండల కేంద్రాల్లో మంగళవారం సిపిఎం పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. పత్తికొండ పట్టణంలో పత్తికొండ పట్టణంలో సిపిఎం పార్టీ ఎర్రగుడి ఈశ్వర్ రెడ్డి వర్ధంతి సభలు నిర్వహించారు. సిపిఎం సీనియర్ నాయకులు రంగారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సభలలో ఎర్రగుడేశ్వర్ రెడ్డి శాసనసభ్యులుగా పత్తికొండ నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి పనులను గుర్తు చేసుకున్నారు. ముఖ్యంగా పత్తికొండ నియోజకవర్గం లని గిరిజన తండా ప్రజల సంక్షేమం కోసం ఆయన చేసిన సేవలను కొనియాడారు. అనంతరం పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద, సిపిఎం పార్టీ కార్యాలయం వద్ద ఉన్న పార్టీ జెండాలను ఆవిష్కరించారు. ఎర్రగుడి ఈశ్వర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఆయన ఆశయాలను నేటితరం ముందుకు తీసుకెళ్లాలని వక్తలు కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం స్థానిక నాయకులు వెంకటేశ్వర్లు, గోపాల్, దస్తగిరి, చక్రాల వెంకటేశ్వర్ రెడ్డి, రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు.



