NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

శ్రీమీనాక్షి జ్యువెలరీ షాపులో దొంగలు పడ్డారు

1 min read

4కేజీల వెండి ఆభరణాలు చోరీ

మంత్రాలయం  న్యూస్ నేడు :  మండల పరిధిలోని తుంగభద్ర గ్రామంలోని మీనాక్షి జ్యువెలరీ షాపులో దొంగలు పడి 4 కేజీల వెండి ఆభరణాలు చోరీ చేసిన సంఘటన శుక్రవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది.  శనివారం మాధవరం ఎస్ఐ విజయకుమార్ తెలిపిన వివరాలు మేరకు  నారాయణ పురం గ్రామానికి చెందిన కంసాలి రవి తుంగభద్ర గ్రామంలో మీనాక్షి జ్యువెలరీ షాపు నడుపున్నాడు.  గత అర్థరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు షాపు షెట్టర్  పగల కొట్టి షాపులోని లాకర్ ఉన్న సుమారు 4 కేజీల వెండి ఆభరణాలు  (దాదాపు రూ. 6.లక్షల పైగా) దొంగలించుకొని పోయారని ,  షాపు యజమాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకునే దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై  తెలిపారు.

About Author