NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఎయిడ్స్ వ్యాధిపై ప్రతి ఒక్కరూ పూర్తి అవగాహన కలిగి ఉండాలి

1 min read

తొలిదశలోనే తగుజాగ్రత్తలు తీసుకుంటే ఎటువంటి రోగాలు అయినను  మన దగ్గరకు చేరవు

ఎయిడ్స్ వ్యాధి నివారణపై  అవగాహన సందర్భంగా 5కె రెడ్ రన్ ను  జెండాఊపి ప్రారంభించి, ర్యాలీలో పాల్గొన్న ఇంచార్జి జిల్లా కలెక్టరు డా:యం.జె.అభిషేక్ గౌడ

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: స్థానిక సర్.సి.ఆర్.రెడ్డి మహిళా కళాశాల వద్ద శుక్రవారం ఎయిడ్స్ వ్యాధి నివారణపై  అవగాహన సందర్భంగా 5కె రెడ్ రన్ ను  జెండాఊపి ప్రారంభించి, ఇంచార్జి జిల్లా కలెక్టరు డా.యం.జె.అభిషేక్ గౌడ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ ర్యాలీ 5కె రెడ్ రన్ వట్లూరులోని సర్.సి.ఆర్.రెడ్డి మహిళా కళాశాల నుండి ప్రారంభమై ప్రభుత్వ ఐటిఐ, పోలీసు పెట్రోల్ బంకు, కొత్త బస్టాండు మీదుగా  ఇండోరు స్టేడియంకు చేరుకుంది.ఈ సందర్భంగా ఇంచార్జి జిల్లా కలెక్టరు డా.యం.జె.అభిషేక్ గౌడ మాట్లాడుతూ ఎయిడ్స్ వ్యాధిపై ప్రతి ఒక్కరూ పూర్తిఅవగాహన కలిగి ఉండాలని, తొలిదశలోనే తగుజాగ్రత్తలు తీసుకుంటే ఎటువంటి రోగాలు అయినను  మన దగ్గరకు చేరవుఅని పేర్కొన్నారు. సమాజంలో విస్తృత అవగాహన అవసరమని,ఇటువంటి అవగాహన సదస్సులు, ర్యాలీలు యువత, స్వచ్ఛంద సంస్థలు ప్రతినిధులు, ఎన్జీవోలు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ​యువత ఎయిడ్స్ వ్యాధి వ్యాప్తి, నివారణా చర్యలుపై సరైన అవగాహన పెంపొందించు కోవాలని, ​కళాశాలలు స్థాయి నుంచే విద్యార్థులు ఇటువంటి చైతన్య కార్యక్రమాల్లో క్రీయాశీలకంగా పాల్గొనాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ​జిల్లావైద్యఆరోగ్య శాఖ అధికారి డా:యు.శోభ, జిల్లా లెప్రసీ, ఎయిడ్స్ మరియు టీబి అధికారి డా.యన్.లక్ష్మీనారాయణ, ఇంటర్మీడియట్ విద్యామండలి  ప్రాంతీయ పర్యవేక్షణ అధికారి (ఆర్ఐవో) కూరపాటి యోహాన్, క్లస్టర్ ప్రోగ్రాం మేనేజరు డా.జె.సామ్ సన్, జిల్లా స్పోర్ట్స్ అభివృద్ధి అధికారి సయ్యద్ అబ్దుల్ అజీజ్, సియస్ వో ఏ.హరినాథ్ కుమార్, జిల్లా వైద్యఆరోగ్యశాఖ సిబ్బంది, ప్రభుత్వ వ్యాయామ కళాశాల, ఇతర కళాశాలలు విద్యార్థులు, ఎన్జీవో లు, పలు స్వచ్ఛంద సంస్థలు ప్రతినిధులు, స్థానిక ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *