NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి

1 min read

టీడీపీ నాయకుల పిలుపు

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని పెదవేగి మండలం కూచింపూడి గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు పిలుపునిచ్చారు. శుక్రవారం ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని గ్రామంలోని ఎస్సీ బాలుర వసతి గృహంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆదేశాల మేరకు గ్రామంలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు చెట్లు ఎంతో కీలకమని, ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి మొక్కలు నాటాలని సూచించారు. అలాగే ప్రభుత్వ కార్యాలయాలు, రహదారుల వెంబడి విస్తృతంగా మొక్కలు నాటి పచ్చదనం పెంపొందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు రామానుజం వెంకటేశ్వరరావు, గ్రామ అధ్యక్షులు గిత్త సత్యనారాయణ, నాయకులు తానంకి సురేష్, దేవరపల్లి నాగార్జున, రామానుజం రవి, సాయల ప్రకాశం తదితరులు పాల్గొన్నారు.

About Author