ఉద్యోగి కుటుంబానికి అండగా ఎక్సైజ్ శాఖ
1 min read
మరణించిన అచ్చన్న కుటుంబానికి ఆర్థిక చేయూత..
నందికొట్కూరు న్యూస్ నేడు: తోటి ఉద్యోగి తమ శాఖలో పని చేస్తూ మరణించిన కుటుంబానికి తోటి ఉద్యోగులు అండగా నిలిచి కుటుంబాన్ని ఆదుకున్నారు.నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలోని హాజీ నగర్ లో నివాసముంటున్న ఇటీవల అనారోగ్యంతో మరణించిన ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖలో పనిచేస్తున్న కానిస్టేబుల్ పెరుమాళ్ళ అచ్చన్న కుటుంబానికి కర్నూలు ఉమ్మడి జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కానిస్టేబుల్ మరియు హెడ్ కానిస్టేబుల్ అసోసియేషన్ తరపున అధ్యక్షులు వెంకటగిరి బాబు అచ్చన్న భార్య సుష్మ మరియు కుమారులు రాజేష్,రాకేష్ లకు బుధవారం ఆర్థిక సహాయం అందజేస్తూ గొప్ప మనసును చాటుకున్నారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.నాగులదిన్నె చెక్ పోస్ట్ లో విధులు నిర్వహిస్తూ పెరుమాళ్ళ అచ్చన్న అనారోగ్యంతో చనిపోవడం చాలా బాధాకరమన్నారు.అంకితభావంతో విధులు నిర్వర్తించే అచ్చన్న అకాలమరణం పొందడం కుటుంబానికి తీరని లోటన్నారు.అచ్చన్న కుటుంబ సభ్యులకు ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖ అండగా ఉంటుందని వారు అన్నారు.ఈ కార్యక్రమంలో జనరల్ సెక్రెటరీ విజయ్ కుమార్,ట్రెజరర్ కల్పన కర్నూలు ఉమ్మడి జిల్లా సభ్యులు పాల్గొన్నారు.


