దెందులూరు మండలం గాలాయ గూడెంలో మీ భూమి-మీ హక్కు
1 min read
రీ సర్వే పాస్ పుస్తకాల పంపిణీ-రైతులకు రాజముద్ర తో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలు
దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పాస్ పుస్తకాలు పంపిణీ
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: దెందులూరు మండలం గాలాయగూడెం గ్రామంలో సోమవారం నాడు “మీ భూమి- మీ హక్కు” కార్యక్రమంలో భాగంగా రీ సర్వే అనంతరం ప్రభుత్వ రాజముద్రతో కూడిన కొత్త పాస్ పుస్తకాలను దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కూటమి నేతలతో కలిసి రైతులకు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా దెందులూరు ఎమ్మెల్యే ప్రభాకర్ మాట్లాడుతూ రీ సర్వే ద్వారా భూములపై స్పష్టమైన హక్కులు రైతులకు కల్పించడం కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ప్రభుత్వ రాజముద్రతో ఇచ్చే పాస్ పుస్తకాలు రైతులకు భద్రత, నమ్మకం కలిగిస్తాయని తెలిపారు.గత వైసిపి పాలనలో రైతుల ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తూ అహంకారంతో కూడిన విధానంతో తమ ఫోటోలను ప్రచురించి రైతులకు పాస్ పుస్తకాలు ఇవ్వడం వారి అహంకారానికి ప్రతీక అని, కూటమి ప్రభుత్వంలో రైతుల ఆత్మ అభిమానానికి ప్రాధాన్యతిస్తూ స్పష్టమైన వివరాలతో కూడిన రాజముద్రతో కూడిన పట్టాదార్ పాస్ పుస్తకాలు ఇవ్వడం కూటమీ ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం అని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ముక్కంటి,ఎంఆర్ ఓ,మండల సర్వేర్,అధికారులు,నికనాయకులు నాయకులు రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


