అన్నదాత సుఖీభవ అమలు పై రైతుల హర్షాతిరేకాలు…
1 min read

ఎద్దుల బండ్లు, ట్రాక్టర్లతో రైతులు భారీగా ర్యాలీ
పత్తికొండ, న్యూస్ నేడు: కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అన్నదాత సుఖీభవ అమలుపై రైతుల్లో హర్షాతి రేఖలు వ్యక్తమవుతున్నాయి. ఈ మేరకు మంగళవారం పత్తికొండలో అన్నదాత సుఖీభవ పథకం అమలు చేసినందుకుగాను రైతన్నలంతా ఎద్దుల పండ్లు, ట్రాక్టర్లతో భారీగా ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఎమ్మెల్యే కే ఈ శ్యామ్ కుమార్ లకు రైతులు ర్యాలీతో కృతజ్ఞతలు తెలిపారు.కూటమి నేతలతో కలిసి ఎమ్మెల్యే కే ఈ శ్యామ్ కుమార్ ఆధ్వర్యంలో పత్తికొండ లో ఎడ్లబండ్ల,ట్రాక్టర్ లతో ర్యాలీ ఘనంగా చేపట్టారు. స్థానిక అంబేద్కర్ కూడలి వద్ద ర్యాలీని ఎమ్మెల్యే కేఈ శ్యామ్ కుమార్ లాంఛనంగా ప్రారంభించారు. అంబేద్కర్ కూడలి నుండి ప్రధాన రహదారులు మీదుగా మార్కెట్ యార్డ్ వరకు ట్రాక్టర్, ఎడ్ల బండ్ల ర్యాలీ రైతన్నల హర్షధ్వానాలతో పండుగ వాతావరణంలో కొనసాగింది. పెద్ద ఎత్తున రైతులు తమ ఎడ్ల బండ్లు మరియు ట్రాక్టర్లతో ర్యాలీలో కదం తొక్కి ఉత్సాహంగా ముందుకు సాగారు.ఈ సందర్భంగా మార్కెట్ యార్డ్ లో ఏర్పాటుచేసిన సభలో ఎమ్మెల్యే కే ఈ శ్యామ్ కుమార్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నదాతలకు ఇచ్చిన హామీ మేరకు అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేశారని చెప్పారు. సూపర్ సిక్స్ పథకాలలో భాగంగా అత్యంత కీలకమైన అన్నదాత సుఖీభవ పథకం కింద మొదటి విడతగా రాష్ట్ర ప్రభుత్వం వాటా 5000 రూపాయలు కేంద్రం వాట 2000 రూపాయల కలుపుకుని రైతుల అకౌంట్లో ₹7,000 జమ చేస్తున్నామని అన్నారు. పత్తికొండ నియోజకవర్గం లో 54 వేల 774 మంది రైతులకు 27.387 కోట్ల రూపాయలను ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు.


