ఇరిగేషన్ ప్రాజెక్టులపై దృష్టి పెట్టండి
1 min read
నీటిపారుదల శాఖ మంత్రిని కోరిన మంత్రాలయం టీడీపీ ఇంచార్జి రాఘవేంద్ర రెడ్డి
మంత్రాలయం న్యూస్ నేడు : కర్నూల్ నగరంలోని బైరెడ్డి ఫంక్షన్ హాల్ లో ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి అభినందన సభకు వచ్చిన నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుని మంత్రాలయం టిడిపి నియోజకవర్గ ఇన్చార్జ్ ఎన్ రాఘవేందర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. మంత్రాలయం నియోజకవర్గ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకరిస్తుందని మంత్రి కి వివరించారు. ఇరిగేషన్ శాఖ సీఈ ఉన్నతాధికారులతో ప్రత్యేక సమీక్ష నిర్వహించి నియోజకవర్గ సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని వారి కోరారు ఇందుకు వారు స్పందిస్తూ మంత్రాలయం నియోజకవర్గంలో నీటి ప్రాజెక్టుల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడుని నియోజకవర్గ ముఖ్య నాయకులతో కలిసి ఘనంగా సన్మానించారు. అంతకు ముందు సభలో టీడీపీ ఇన్చార్జ్ రాఘవేంద్ర రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు , ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ , మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో కూటమి ప్రభుత్వం సంక్షేమం – అభివృద్ధిని రెండు కళ్లుగా భావించి రాష్ట్రాన్ని పురోగతి పథంలో నడిపిస్తోందని అన్నారు. గత రెండేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువ కావడం కూటమి ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని పేర్కొన్నారు.అలాంటి ప్రజాదరణ పొందిన ప్రభుత్వాన్ని చూసి తట్టుకోలేక ప్రతిపక్ష వైసీపీ నేతలు ‘రెండేళ్లకు వెన్నుపోటు’ అంటూ కార్యక్రమాలు నిర్వహించడం దురదృష్టకరమని విమర్శించారు. ప్రజలు వాస్తవాలను గమనిస్తున్నారని, అభివృద్ధికి అడ్డుపడే రాజకీయాలను ఎప్పటికీ ఆదరించరని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు మాధవరం రఘునాథరెడ్డి , యువ నాయకులు రాజారెడ్డి నియోజకవర్గ కూటమి ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

