NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండించిన మాజీ ఎమ్మెల్యే కాటసాని రామభూపాల్ రెడ్డి

1 min read

చిప్పగిరి పోలీస్ స్టేషన్‌లో ఉన్న ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షిని పరామర్శించిన కాటసాని రామభూపాల్ రెడ్డి

అనంతరం ఎమ్మెల్యే విరూపాక్షి  నివాసంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ…!!!

ఆలూరు, న్యూస్​ నేడు: ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి , ఆయన కుమారుడు చంద్రశేఖర్‌ను అర్ధరాత్రి సమయంలో పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నంద్యాల జిల్లా అధ్యక్షులు, పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రామభూపాల్ రెడ్డి గారు తీవ్రంగా ఖండించారు.కర్నూలు జిల్లా చిప్పగిరిలో రాత్రి 2.45 గంటల సమయంలో భారీ పోలీసు బలగాలను మోహరించి, ఎమ్మెల్యే నివాసం తలుపులు బద్దలు కొట్టి దౌర్జన్యంగా ఇంట్లోకి ప్రవేశించి అరెస్టు చేయడం ప్రజాస్వామ్య విలువలను కాలరాసే చర్య అని ఆయన మండిపడ్డారు..చిప్పగిరి మండలం సంగాల గ్రామంలో వైఎస్సార్‌సీపీ నేత గిరి ఇంటిపై టీడీపీ నాయకుడు నాగరాజు, అతని అనుచరులు దాడికి పాల్పడగా బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు ఎమ్మెల్యే విరూపాక్షి  వెళ్లారని తెలిపారు. ఈ సందర్భంగా టీడీపీ గూండాలు ఎమ్మెల్యేపై రాళ్లు రువ్వడంతో ఆయన సోదరుడు శ్రీరాముడు గాయపడ్డారని పేర్కొన్నారు..ఈ ఘటనపై టీడీపీ నాయకులపై ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకుండా, బాధితులకు న్యాయం చేయాల్సింది పోయి వారినే లక్ష్యంగా చేసుకుని ఎమ్మెల్యే విరూపాక్షి , ఆయన కుమారుడిపై కేసులు నమోదు చేసి అర్ధరాత్రి అరెస్టు చేయడం ప్రభుత్వ కక్షసాధింపు రాజకీయాలకు నిదర్శనమని విమర్శించారు..ప్రజల కోసం పోరాడుతున్న ప్రజాప్రతినిధులను భయపెట్టే ప్రయత్నాలు ఎంత చేసినా వైఎస్సార్‌సీపీ వెనక్కి తగ్గదని, అక్రమ కేసులు, అక్రమ అరెస్టులతో ప్రజాస్వామ్య గొంతును అణచివేయలేరని ఆయన స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో కర్నూలు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, ఆదోని మాజీ శాసనసభ్యులు సాయి ప్రసాద్ రెడ్డి , మాజీ మంత్రి శైలజానాథ్ ,ఎమ్మెల్సీ ఇషాక్ భాషా ,అనంతపురం మాజీ ఎంపీ తలారి రంగయ్య , ఎమ్మెల్సీ మధుసూదన్ , మాజీ పార్లమెంట్ సభ్యురాలు బుట్టా రేణుక , పత్తికొండ మాజీ శాసనసభ్యురాలు శ్రీదేవి , కర్నూలు నగర మాజీ మేయర్ బి.వై రామయ్య , అనంతపురం జిల్లా ఉపాధ్యక్షురాలు వై.నైరుతి రెడ్డి ,ప్రదీప్ రెడ్డి , పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *