కర్నాటక ఆర్టీసీ బస్సు ఢీకొని పంచాయతీ కార్మికుడు హరిజన తిక్కస్వామి మృతి
1 min read
రాంగ్ రూట్ లో వచ్చి అతివేగంగా ఢీకొన్న కర్ణాటక ఆర్టీసీ బస్సు
స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని అధికారులతో వాగ్వివాదం
మంత్రాలయం న్యూస్ నేడు : మండల పరిధిలోని చెట్నిహల్లి గ్రామంలో జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో పంచాయతీ కార్మికుడు మృతి చెందిన సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చెట్నహల్లి పంచాయతీ లో చెత్త బండి కార్మికుడు హరిజన తిక్కస్వామి (60)అనే వ్యక్తి రోడ్డు దాటుతుండంగా మంత్రాలయం నుండి రాయచూరు కు వెళుతున్న కర్ణాటక ఆర్టీసీ బస్సు రాంగ్ రూట్ లో అతివేగంగా వచ్చి ఢీకొనడంతో ఆక్కడిక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న బంధువులు పోలీసులకు సమాచారం అందించారు. వారు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు తెలుసుకున్నారు. అయితే బంధువులు, గ్రామస్తులు జాతీయ రహదారిపై బైటాయించికుర్చున్నారు. దీంతో సిఐ దస్తగిరి బాబు, తహసీల్దార్ రమాదేవి, ఎస్ఐ మల్లికార్జున, మాధవరం ఎస్సై విజయ కుమార్ లు సర్దిచెప్పేందుకు ప్రయత్నం చేశారు. అయినా చెట్నహల్లి లో రహదారిపై స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని మృతుని బంధువులు, గ్రామస్తులు ఆందోళన చేశారు. పోలీసులు ఎంత చెప్పినా భీష్మీంచికున్నారు. దీంతో రెండు గంటల పాటు వాహనాలు రెండు కిలోమీటర్ల మేర అటు ఇటు నిలిచిపోయాయి. చేసేది లేక స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడం తో శాంతించి వెనుదిరిగారు. ఆదోని ఆర్డీఓ అరుణ దేవి వచ్చి అధికారులు, గ్రామస్తుల సమక్షంలో స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేశారు. మృత దేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ తెలిపారు. మృతుని కి భార్య లక్ష్మి ఉంది. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.



