మతసామరస్యం.. పర్యావరణ పరిరక్షణకు శ్రీకారం
1 min read
ఖాన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మట్టి గణపతి ప్రతిమలు పంపిణి
ఖాన్ సేవలను కొని యాడిన టిడిపి నాయ కులు
మదనపల్లె , న్యూస్ నేడు ప్రతినిధి : మదనపల్లెలో మత సామ రస్యానికి, పర్యావరణ పరి రక్షణకు ప్రతీకగా ఖాన్ ఫౌండేషన్ ఆదర్శంగా నిలు స్తోంది.వినాయక చవితి పర్వదినాన్ని పురస్క రించుకుని, ఖాన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతి ఏటా అనవాయితీగా నిర్వహిస్తున్న పర్యావరణ హితమైన మట్టి వినాయక విగ్రహాలు, మొక్కలపంపిణి ఈ ఏడాది కూడా నిర్వ హించి ప్రజలకు ఉచితంగా పంపిణీ చేశారు. ఏపీ ఉర్దూ అకాడమీ వైస్ చైర్మన్, తెలుగుదేశం పార్టీ రాజంపేట పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పఠాన్ ఖాదర్ ఖాన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్య క్రమానికి ముఖ్య అతిథులుగా తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పచ్చి పాల తులసి, విశ్వ బ్రాహ్మణ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ పచ్చిపాల రామకృష్ణ ఆచారి, ఎంప్లాయిస్ యూనియన్ ఏపీఎస్ఆర్టీసీ ఒకటి మరియు రెండు డిపోల గౌరవ అధ్యక్షులు నాగూర్ వలి, టిడిపి సీనియర్ నాయకులు ఆర్జే వెంకటేష్ లు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రజలకు ప్రకృతి ని కాపాడు కొందాం, పర్యావరణాన్ని పరి రక్షిస్తూ, భక్తి, బాధ్యత రెండింటినీ చాటి చెబుతూ ఉచితంగా వినాయక విగ్రహ ప్రతిమలను పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా భక్తి భావంతో పఠాన్ ఖాదర్ ఖాన్ ప్రతి ఏటా ఆనవాయి తీగా వినాయక చవితి పండుగను పురస్కరించు కొని మట్టి గణపతి విగ్రహ ప్రతిమలను ప్రజలకు ఉచితంగా అందజేయడం హర్షించదగ్గ విషయ మని కొనియాడారు. నేడు పర్యావరణం సమతుల్య త దెబ్బతిని ప్రకృతి క్షీణిస్తున్న నేపథ్యంలోతిరిగి మొక్కలను పెంపొందించా లన్న సదుద్దేశంతో విత్త నాలతో కూడిన గణపతిని మరియు మొక్కలను ఇవ్వడం మూలంగా కొత్త మొక్కలు నాటడం నిమజ్జనం చేసిన గణపతి ప్రతిమల నుంచి కొత్త మొక్కలు మొలసి ప్రకృతిని కాపాడడానికి దోహదపడేలా చర్యలు తీసుకోవడం గొప్ప విషయం అన్నారు. భవిష్యత్తులో ఖాదర్ ఖాన్ మరిన్ని ఉన్నత పదవులు అలంకరించి ప్రజలకు మరింత మెరుగైన సేవలను పెద్ద ఎత్తున అందించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తెలుగు దేశం పార్టీ నాయకులు, అభిమానులు, కూటమి పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.



