“మాజీ సైనికుల కొరకు ఉచిత న్యాయ సేవలు”
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: రాష్ట్ర న్యాయ సేవ అధికార సంస్థల ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ అధ్యక్షులు మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి సూచనల మేరకు జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ, కార్యదర్శి ఐన బి. లీలా వెంకట శేషాద్రి 25-04-2026 శనివారం నాడు బి.క్యాంపు నందు గల జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీస్ ను సందర్శించి అందు గల మాజీ సైనికుల సమస్యల గురించి చర్చించారు. జిల్లా సైనిక సంక్షేమ కార్యాలయం నందు మాజీ సైనికుల కొరకు నల్సా వీర్ పరివార్ సహాయత యోజన 2025 పధకం లో భాగంగా లీగల్ సర్వీసెస్ క్లినిక్ ను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు . జడ్జి మాట్లడుతూ ఈ క్లినిక్ లో న్యాయ వాది మరియు ప్యారా లీగల్ వాలంటీర్ లు ఉంటారని వీరు మాజీ సైనికుల కు చట్టభద్ధ మైన సమస్య లు ఉంటే వాటికీ ఉచితంగా న్యాయాన్ని అందించి వారి సమస్య లను పరిష్కరిస్తారని తెలిపారు. మాజీ సైనికులు అందరు ఉచిత న్యాయ సహాయానికి అర్హులని తెలిపారు. మాజీ సైనికులు వారి కుటుంబ సభ్యులు వారి చట్టాపరమైన సమస్యల పరిష్కారం కోసం లీగల్ సర్వీసెస్ టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నెంబర్ 15100 కు ఫోన్ చేస్తే వారి సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు.ఈ సదస్సు లో కర్నూలు జిల్లా ఇంచార్జి సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ మహేంద్రమ్మ , ప్యారా లీగల్ వాలంటీర్ మధు సుధన్,మాజీ సైనిక ఉద్యోగుల అధ్యక్షులు, మాజీ సైనికులు పాల్గొన్నారు.

