NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పిల్లలపై లైంగిక వేధింపులకు పాల్పడితే కఠిన శిక్షలు ”                              

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవ అధికార సంస్థ ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి, బి. లీలా వెంకట శేషాద్రి సూచనల మేరకు లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ చీఫ్ శివరామచంద్రరావు మరియు జాగృతి యూనిట్ మెంబర్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ ఈ రోజు అనగా 21-05-2026 న పెద్దపాడు నందు గల దామోదరం సంజీవయ్య బాల సదన్ నందు   పోక్సో యాక్ట్ పై న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. శివ రామ చంద్ర రావు మాట్లాడుతూ జాగృతి పథకం 2025 కింద “సురక్షిత బచ్పన్- సురక్షిత్ భవిష్య” పై అవగాహన కల్పించారు. అక్కడి గల పిల్లలకు పోక్సో యాక్ట్ పై అవగాహన కల్పించారు. లైంగిక నేరాల నుండి రక్షణ చట్టం 2012 ప్రకారం పిల్లల పై లైంగిక వేధింపులకు పాల్పడితే కఠిన శిక్షలు కలవని తెలిపారు. 18 సంవత్సరాల లోపు వయస్సు గల పిల్లలపై లైంగిక వేధింపులకు పాల్పడకుండా   ఈ పోక్సో యాక్ట్  ఉపయోగ పడుతుందని తెలిపారు.ఈ పోక్సో కేసుల ను త్వరిత గతిన పరిష్కరించేoదుకు ప్రత్యేక కోర్ట్ కలదని తెలిపారు. పిల్లలకు ఏదయినా సమస్య వస్తే  లీగల్ సర్వీసెస్ టోల్ ఫ్రీ నెంబర్ 15100 కాల్ చేస్తే వారి సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. అనంతరం జాగృతి యూనిట్ మెంబర్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ మాట్లాడుతూ చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్. 1098,మహిళా హెల్ప్ లైన్ నెంబర్. 181,పోలీస్ హెల్ప్ లైన్ నెంబర్. 112 ల  గురించి పిల్లలకు వారి తల్లిదండ్రులకు వివరించారు. ఈ సదస్సు లో ఐ సి డి యస్ అధికారులు, జాగృతి యూనిట్ మెంబర్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్, న్యాయవాది సుదీప్ పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *