వేసవిలో తాగునీటి సమస్య లేకుండా మంచినీటి చెరువులను పూర్తిస్థాయిలో నింపాలి
1 min read

పశువులు, పక్షులు దాహార్తిని తీర్చేందుకు నీటి తోట్టేలను ఏర్పాటు చెయ్యాలి
జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి
వేసవి దృష్టిలో ఉంచుకుని జిల్లాలో త్రాగునీటి సమస్య తలెత్తకుండా పటిష్టమైన ప్రణాళికతో పక్కాగా అమలు చెయ్యలి
జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి అధికారులకు ఆదేశo
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: స్థానిక జిల్లా కలెక్టరేటు గౌతమీ సమావేశం మందిరంలో బుధవారం జిల్లాలో త్రాగు నీరు, పారిశధ్య, జల్ జీవన్ మిషన్ ద్వారా చేపట్టిన పనులు పురోగతిపై సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి సమీక్షించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లాలో ప్రతి గ్రామానికి త్రాగునీటిని పక్కగా అందించే ప్రక్రియలో భాగంగా ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీ అధికారులు సమన్వయంతో జిల్లాలోని మంచినీటి చెరువులను పూర్తిస్థాయిలో నింపాలని ఆదేశించారు.జిల్లాలో జలజీవన్ మిషన్ పథకం ద్వారా 1223 పనులు లక్ష్యానికి ఇప్పటివరకు 11.23 కోట్ల రూపాయలతో రూ 858 పనులను పూర్తి చేసామన్నారు.మిగిలిన పనులు పురోగతిలో ఉన్నాయని వాటిని త్వరితగతిన పూర్తి చెయ్యాలని అధికారులను జిల్లా కలెక్టరు ఆదేశించారు. జిల్లాలో 266 హౌసింగు కాలనీలకు సంబంధించి రూ 861 లక్షలు రూపాయలతో 96 పనులను పూర్తిచేయడం జరిగిందన్నారు. మిగిలిన పనులను పూర్తిచేసే విధంగా తగు చర్యలు చేపట్టాలని అధికారులు ఆదేశించారు. జిల్లాలో త్రాగునీటికి సంబంధించి పిజిఆర్ఎస్ లో నమోదైన ప్రతి పిటిషన్ ను పరిష్కరించాలన్నారు. జిల్లాలో హర్ ఘర్ జల్ పథకం ద్వారా 18 ఎన్ వి ఎస్ పనులను చేపట్టేందుకు రూ 8572 లక్షల రూపాయలను మంజూరు చేసేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదన సమర్పించడం జరిగిందని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఆర్డబ్ల్యూఎస్ అధికారి జి. త్రినాధబాబు, జిల్లా వ్యవసాయ శాఖ జెడి యస్.కె.హబీబ్ భాషా, నీటిపారుదల శాఖ యస్ఇ సి.హెచ్.దేవప్రకాష్, పంచాయతీ రాజ్ యస్ఇ జెడ్.రమేష్, డైలాల్లాల్ ఐసిడియస్ పిడి పి.శారద, జిల్లా గ్రౌండు వాటరు డిడి పైలా కోదండరామ్, జిల్లా విద్యాశాఖ అధికారి యం.వెంకటలక్ష్మమ్మ, డిఆర్డీఏ పిడి టి.వి.విజయలక్ష్మి, సంబంధిత శాఖలు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.


