NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పేద ఆడబిడ్డ వివాహానికి చేయూత

1 min read

నందికొట్కూరు న్యూస్ నేడు: నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణానికి చెందిన ఒక నిరుపేద ఆడబిడ్డ వివాహానికి గాను తమ వంతుగా మేము కుటుంబానికి ఆసరాగా ఉంటామని ఆడబిడ్డ వివాహానికి ఆర్థిక చేయూతనందించారు. వివరాల్లోకి వెళ్తే నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణం బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి కాలనీకి చెందిన పెయింటర్ మౌలాలి కూతురుకు వివాహం నిశ్చయం అయింది.ఈ కుటుంబం పేదరిక కుటుంబం కావడంతో పెయింటర్ మౌలాలికి స్నేహితులందరూ కలిసి బుధవారం వారి ఇంటికి వెళ్లి స్నేహితులు 17వేల రూపాయల నగదును కుటుంబానికి అందజేశారు. ఆర్థిక చేయూతను అందించినందుకు గాను కుటుంబ సభ్యులు వారికి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో దూదేకుల కమ్యూనిటీ పెద్దలు మౌలాలి బుజ్జి,డి కాజా,మాభాష,పి బాబు,సిద్ధ,హసన్,మన్సూర్, అలీ అక్బర్ తదితరులు పాల్గొన్నారు.

About Author