అమ్మవారి దేవస్థానం ధర్మకర్త మండలి ప్రమాణ స్వీకార మహోత్సవం
1 min read

ఆలయాల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తోడ్పడాలి
ఎమ్మెల్యే బడేటి చంటి
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : ఏలూరు స్థానిక మూడు గుళ్ళ సెంటర్ లో శ్రీ కనకదుర్గ అమ్మవారి దేవస్థానం మరియు పత్తేబాధ లో శ్రీ చౌడేశ్వరి రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం నూతన ధర్మకర్త మండలి ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, ఏలూరు మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు, 37 డివిజన్ కార్పొరేటర్ నాయుడు సోము శారద, జిల్లా దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారి కూచిపూడి శ్రీనివాస్, తనిఖీదారు ఎన్. ఉదయ్ కుమార్ బాబు, కార్యనిర్వహణాధికారి నల్లూరి సతీష్ కుమార్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బడేటి చంటి మాట్లాడుతూ నూతన ధర్మకర్త మండలి సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆలయ అభివృద్ధికి ప్రతి ఒక్క సభ్యులు తోడ్పడాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ చౌడేశ్వరి రామలింగేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ మరకా శివయ్య, ధర్మకర్త లు గ అభిమల్ల శ్రీనివాసరావు,కాకర్ల వెంకట దుర్గ,తాళ్లగంగ, రామేశ్వరపు సౌజన్య, నడమర్తి శ్రీ లక్ష్మీ సూర్యకుమారి, గారపాటి ఫణికుమార్, శీలా దుర్గాప్రసాద్, మారుబారిక శ్రీనివాసరావు ప్రమాణస్వీకారం చేశారు. శ్రీ కనకదుర్గ అమ్మవారి దేవస్థానం నూతన చైర్మన్ గా పృథ్వి సత్యనారాయణమూర్తి, ధర్మకర్తలుగా పోలినాటి సత్తిరెడ్డి, కపిలవాయి రాజేశ్వర కుమార్, బొమ్మన హేమలత, కంచోటి దుర్గ, బోడెం ఉమామహేశ్వరి, అడ్డాల వెంకటేశ్వరరావు, పొన్నాడ వెన్నెల, మరియు అర్చకులు ప్రయాగ వెంకట రామమూర్తి పాల్గొన్నారు. నూతనంగా ఎన్నికైన చైర్మన్లు, ధర్మకర్త లకు పూలు మరియు దుస్సావులతో ఘనంగా సత్కరించారు.


