వైయస్ జగన్ హయాంలోనే రాష్ట్రం లో సుపరిపాలన
1 min read
వైసిపి రాష్ట్ర ఎస్ ఇ సి సభ్యుడు సత్య సాయినాథ్ శర్మ
న్యూస్ నేడు కమలాపురం: రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలోని సుపరిపాలన జరిగిందని వైయస్సార్సీపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు గా నియమితులైన కాశీభట్ల సత్య సాయినాథ్ శర్మ అన్నారు.రాష్ట్ర వైసిపి ఎసిసి సభ్యుడుగా నియామకమైన తర్వాత కమలాపురంలో శనివారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు .రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఎన్నో రకాల మతలబులు చేస్తున్నప్పటికీ 2029 లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పదవి చేపట్టడం తధ్యమన్నారు.రాష్ట్రంలో ప్రజల సంక్షేమం గురించి ఆలోచించే ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని ఆయన పేర్కొన్నారు .ప్రచారాల కోసం కూటం నాయకులు పని చేస్తూ ఉంటే ప్రజల సంక్షేమం కోసం జగన్ మోహన్ రెడ్డి నాడు నిజాయితీతో నిబద్ధతతో విశ్వాసంతో నమ్మకంతో పని చేశాడన్నారు.తన నియామకానికి పూర్తిస్థాయిలో సహకరించిన పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి కి జిల్లా పార్టీ అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి కి పార్లమెంటు సభ్యులు అవినాష్ రెడ్డి కి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డికి సహకరించిన ప్రతి నాయకుడికి ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు.వైయస్సార్ పార్టీ విధానాల పట్ల నిబద్ధతతో అకుంఠిత దీక్షతో పనిచేసి జగన్ మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసేంతవరకు తాము పూర్తిస్థాయిలో పార్టీ కోసం పనిచేస్తామని ఆయన ఉద్ఘాటించారు .

