ప్రతి వ్యక్తిలో దేశభక్తి నిర్మాణం కావాలి
1 min read
లక్ష్మణ్ జీ- విభాగ్ ప్రచారక్
ఘనంగా ఆర్.ఎస్.ఎస్. శతాబ్ది వేడుకలు
కర్నూలు, న్యూస్ నేడు: ప్రతి వ్యక్తిలో దేశభక్తి నిర్మాణం కావాలని, అందుకోసం ఒకే ఆశయంతోటి పనిచేస్తున్న స్వచ్చంద సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అని, అనంతపురం విభాగ్ ప్రచారక్ లక్ష్మణ్ జీ అన్నారు. మండల కేంద్రమైన కలసపాడు లోని శ్రీ మహా లంకాలమ్మ ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన ఆసంస్థ శతాభ్థి వేడుకల సందర్బంగా గణవేషధారులైన స్వయం సేవకులకు వారు మార్గదర్శనం చేశారు. దేశ భక్తిలేని సమాజం అడుగడుగునా పరాభవాలకు గురవుతుందని, దేశంలోని ప్రతి వ్యక్తి స్వాభిమానంతో జీవించాలని, తరతరాల యుగయుగాల వారసత్త్వానికి ప్రతినిధులమనే స్పృహను కలిగిఉండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత ప్రధానోపాధ్యాయులు చెముడూరు వీరస్వామి, శ్రీ మహా అంకాలమ్మ దేవస్థానం అభివృద్ది మండలి అధ్యక్షులు మరియు సంఘ మండల ప్రముఖ్ మాజీ సైనికులు తిమ్మిశెట్టి వెంకటేశ్వర్లు, గృహసంపర్క ప్రముఖ్ అక్కిశెట్టి శ్రీనివాసులు, ఖండ పర్యావరణ ప్రముఖ్ మీసాల రామలక్ష్మయ్య, ఖండ సమరసతా సేవా ప్రముఖ్ మేకల ప్రసాద్, సంగమండల సహప్రముఖ్ పీరారెడ్డి, సేవాప్రముఖ్ యు. చెన్నయ్య, సంఘ మండల ప్రచార ప్రముఖ్ వాసు, సంగమండల సహా సేవ ప్రముఖ దామిరెడ్డి పోలిరెడ్డి, రామకోటితో పాటు వందమందికి పైగా స్వయం సేవకులు, పెద్ద సంఖ్యలో పురప్రముఖులు పాల్గొన్నారు.


